ఇక తెలంగాణా కరోనా పరీక్షలు సూపర్ ఫాస్ట్ !

నిమ్స్ ఆస్పత్రిలో కోబాస్ 8800 మిషన్ ను మంత్రి ఈటల ప్రారంభించారు. ఈ కోబాస్ 8800కు ప్రతి రోజు 4 వేల కరోనా టెస్టులు చేసే సామర్ధ్యం ఉంది. కరోనా ఉక్కిరి బిక్కిరి చేసి ఆరోగ్యం విషయంలో ఇబ్బంది పెట్టిన సందర్భంలో పేద ప్రజానీకానికి అందుబాటులో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిమ్స్ అని మంత్రి ఈటల పేర్కొన్నారు. ప్రస్తుతం రోజుకు 20వేల ఆర్టిపిసిఆర్ టెస్టులు..చేస్తుండగా.. కోబాస్ తో.. రోజుకు 4 వేల కేసులు చేయొచ్చని ,మంత్రి పేర్కొన్నారు.

ప్రభుత్వ వైద్యంలో ఇన్ఫ్రా స్ట్రక్చర్ అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నామన్న ఆయన ఇప్పటికే అనేక రకాల పరికరాలను సమకూర్చామని అన్నారు. దేశంలోనే కోబాస్ 8800 ను మొట్ట మొదట కొనుగోలు చేసామని ఆయన అన్నారు. ఆర్ టి పీసీఆర్ టెస్ట్ లు రోజుకి 4000 వరకు టెస్ట్ చేయవచ్చని ఆయన అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ లో పని చేసిన ప్రతి వ్యక్తిని ప్రజలు ఆదరిస్తున్నారన్న ఆయన ప్రజలే జాగ్రత్తలు తీసుకుంటు… ఇంట్లోనే ఉండీ చికిత్స పొందుతున్నారని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఔట్ సోర్సింగ్, 4వ తరగతి ఉద్యోగులకు జీతాల పెంపుపై కసరత్తు చేస్తున్నామని ఆయన అన్నారు.