అంత్యక్రియల విషయంలో కూడా షరతులు…

-

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విలయ తాండవం చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ దెబ్బకు అనేక దేశాలు విధిస్తున్న ఆంక్షలు రోజురోజుకూ కఠినతరంగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 8 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో లక్షా 72 వేల మంది కోలుకోగా.. 39 వేల మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు విడిచారు. అటు అమెరికా, ఇటలీ, స్పెయిన్ దేశాల్లో అత్యధిక కేసులు నమోదు కాగా.. ఇటలీలో అత్యధికంగా 12 వేల మందికి పైగా మరణించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూడు దేశాల్లోనూ పాజిటివ్ కేసుల సంఖ్యతో పాటు మరణాలు కూడా పెరుగుతూ వస్తుండటంతో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.అయితే ఈ మహమ్మారి వల్ల మృతి చెందిన వారి అంత్యక్రియలను సాంప్రదాయ బద్దంగా నిర్వహించాలీ అనుకుంటే మాత్రం అక్కడి ప్రభుత్వాలు ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. అసలు ఈ వైరస్ సోకిన వారి డెడ్ బాడీలను కుటుంబ సభ్యులకు అప్పగించడానికి కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అందుకే ఈ డెడ్ బాడీల విషయంలో ఈ దేశాలు కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తుంది . కరోనా తో అతలాకుతలం అవుతున్న స్పెయిన్ దేశం కూడా అంత్యక్రియల విషయంలో కొన్ని ఆంక్షలను పెట్టినట్లు తెలుస్తుంది. ఈ వైరస్ వల్ల చనిపోయిన వారి అంత్యక్రియలకు కుటుంబ సభ్యులు సామూహికంగా హాజరుకాకూడదు అని, కుటుంబసభ్యులతో పాటు ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ మంది హాజరు కావద్దంటూ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.

ఈ కరోనా మహమ్మారి నేపథ్యంలో స్పెయిన్ లో కూడా ఏప్రిల్ 11 వరకు లాక్ డౌన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎవరూ కూడా సామూహికంగా ఎలాంటి కార్యక్రమాలకు ప్రజలు హాజరు కాకూడదు కొన్ని షరతులు విధించినట్లు తెలుస్తుంది. ప్రపంచ దేశాలు ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా మాత్రం కోవిడ్-19 కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. భారతదేశంలో కూడా ఈ కరోనా మహమ్మారి తీవ్ర రూపం దాలుస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోనుంది.

Read more RELATED
Recommended to you

Latest news