రైతులకు మత్స్య, తేనేటీగల పరిశ్రమ రెండు కూడా మంచి ఆదాయాన్ని ఇచ్చేవే..తేనెటీగలు పూలలో మకరందాన్ని తేనెగా మార్చి, తేనెపట్టు అరలలో దానిని నిల్వ చేసుకుంటాయి.తేనెకు దాని ఉత్పత్తులకు మార్కెట్లో గిరాకీ పెరుగుతుండటంతో తేనెటీగల పెంపకం లాభసాటి పరిశ్రమగా మారింది..అతి తక్కువ పెట్టుబడితో కూడుకున్న పరిశ్రమ..ఇకపోతే..తేనెటీగల పెంపకానికి , మైనం తయారీకి వ్యవసాయ పరంగా కొద్దిపాటి స్ధలం సరిపోతుంది. కొద్దిపాటి వనరులు తేనెటీగల పెంపకానికి సరిపోతాయి. పర్యవరణంపై సానుకూల ప్రవాం ఉంటుంది. పూలు పూసే మొక్కలలో పరాగ సంపర్కానికి తేనెటీగలు ఎంతగానో ఉపయోగపడతాయి. పొద్దుతిరుగుడు తోపాటు, వివిధ రకాల పంటలలో, పండ్ల మొక్కలలో అధిక దిగుబడికి తేనెటీగల పెంపకం ఉపయోగపడుతుంది..ఈ తేనేటీగల పెంపకంలో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పొడవుగా ఉండే ఒక చెక్క పెట్టె, దీనిపై భాగం నుండి కింది వరకు పొడవైన అనేక పెట్టెలు ఉంటాయి. ఈ పెట్టె కొలతలు 100సెంమీ వెడల్పు, 45 సెం.మీ ఎత్తు 25 సెం.మీ మందం 2 సెం.మీ తేనె టీగలు రావటానికి, పోవటానికి వీలుగా ఈ పెట్టెకు ఒక్కొక్కటి ఒక సెం.మీ వెడల్పు కలిగిన రంద్రాలు ఉంటాయి. పెట్టెకు, పైన పట్టెల బిగింపు రంద్రాలు మూసుకుపోని విధంగా ఉండాలి. పట్టెలు పెట్టె కింద వరకు ఉండాలి. ఎక్కవగా తేనెటీగలు పడితే బరువును మోసేవిధంగా ఉండాలి..అదే విధంగా ఈగలు తిరగడానికి ఫ్రీగా ఉండాలి..
తేనె పట్టుకు దగ్గరగా ఉన్నప్పుడు తేనెటీగలు కుట్టకుండా కళ్లను కప్పిఉంచేలా ప్రత్యేమైన డ్రస్సును ధరించాలి. అలాగే ఒక చాకు అవసరం అవుతుంది. చాకు తేనె పట్టెపై పట్టెలను కదిలించి తేనె అరలను కత్తిరంచటానికి సహాయ పడుతుంది..అయితే… ముఖ్యంగా విద్యుత్ స్టేషన్లు, ఇటుక బట్టీలు, రైల్వే ట్రాకులకు దూరంగా తేనెపెట్టెలు పెట్టాలి. దగ్గర్లో స్వచ్ఛమైన పారే నీరు లభ్యమవ్వాలి. పెనుగాలులు, ఈదురు గాలుల నుంచి తేనెపట్టుల రక్షణకు సహజసిద్దమైన లేదా కృత్రిమంగా పెంచిన చెట్లుండాలి..తేనేటీగలను ఎంపిక విషయం లో జాగ్రత్తలు తీసుకోవాలి.ఒక్కో పెట్టె నుంచి దాదాపు 10 కెజీల వరకూ తేనే వస్తుంది..ఇంకేమైనా సందెహాలు ఉంటే వ్యవసాయ నిపునులను సంప్రదించాలి..