భారత్ కు అరుదైన గౌరవం… కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో అధికారిక హోదా

-

చలనచిత్ర పరిశ్రమలో ప్రతిష్టాత్మక అవార్డులైన ఆస్కార్ అవార్డులకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శితమయ్యే చిత్రాలకు కూడా అదే స్థాయిలో గుర్తింపు ఉంటుంది. అయితే.. ఈ నెల 17 నుంచి 28వ తేదీ వరకు ఫ్రాన్స్ లోని కేన్స్ లో ఈ ఏడాది చలన చిత్రోత్సవాలు జరగనున్నాయి. 75 వసంతాల స్వతంత్ర భారత్ కు కేన్స్ ఫిలిం ఫెస్టివల్ మార్కెట్లో అధికారిక దేశం హోదా కల్పిస్తూ.. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అటు, కేన్స్ ఫిలిం ఫెస్టివల్ కూడా 75 వసంతాల వేడుక జరుపుకుంటోంది.

Off to the Cannes Film Festival – Honest Mum

అంతేకాకుండా.. బాలీవుడ్ భామ దీపిక పదుకొనే కేన్స్ ఫిలిం పెస్టివల్ కాంపిటీషన్ జ్యూరీలో సభ్యురాలిగా నియమితులవడం విశేషం. ఈ సారి కేన్స్ లో భారతీయ దిగ్గజ దర్శకుడు సత్యజిత్ రే తెరకెక్కించిన ‘ప్రతిధ్వని’ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించనుండగా.. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 4కే టెక్నాలజీకి అనుగుణంగా పునరుద్ధరిస్తున్నారు. ‘ప్రతిధ్వని’ చిత్రంతో పాటు హాలీవుడ్ క్లాసిక్ గా పేరుగాంచిన ‘సింగిన్ ద రెయిన్’ , ‘థాంప్’ (అరవిందన్ గోవిందన్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం) కూడా ఇక్కడ ప్రదర్శించనున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news