ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడం చేత వారి సౌకర్యం కోసం సౌత్ సెంట్రల్ రైల్వే హైదరాబాద్ -తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడుపుతుందని సీపీఆర్వో సీహెచ్ రాకేశ్ వెల్లడించారు. ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6.15 గంటలకు హైదరాబాద్ -తిరుపతి స్పెషల్ ట్రైన్ బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతి చేరుకుంటుందని వెల్లడించారు. మరల తిరుపతి నుండి 30వ తేదీ రాత్రి 8.25కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.50కి తిరిగి హైదరాబాద్ చేరుకుంటుందని పేర్కొన్నారు.
ఈ నెల 27వ తేదీ సా. 6.10కు హైదరాబాద్–తిరుపతి అనే మరో స్పెషల్ ట్రైన్ బయలుదేరి మరుసటిరోజు ఉదయం 6.45కు తిరుపతి చేరుకుంటుందని తెలిపారు. మరల తిరుపతి నుండి 28వ తేదీ సాయంత్రం 5.15కు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.30కు తిరిగి హైదరాబాద్ చేరుకుంటుందని తెలియజేశారు..
ఈ నెల 29న రాత్రి 8.30కు హైదరాబాద్–కాకినాడ స్పెషల్ ట్రైన్ బయలుదేరి మరుసటిరోజు ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుకుంటుందని, మరల కాకినాడ నుండి 30వ తేదీ రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 9 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుందని పేర్కొన్నారు.