మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి టికెట్ లేనట్టే.. తేల్చేసిన నారా లోకేష్

-

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఉన్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది.. ఇప్పటికే ఐదు సార్లు ఓడిపోయిన ఆయనపై టిడిపి అధిష్టానం అసంతృప్తితో ఉందనే ప్రచారం నెల్లూరులో జరుగుతుంది.. అవకాశం ఇచ్చిన ప్రతిసారి.. ఓటమిపాలవుతున్నారని.. పార్టీ బలోపేతానికి అయన ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని ఆయన పట్ల పార్టీ పెద్దలు సంతృప్తి వ్యక్తం చేశారట..

రెడ్డి సామాజిక వర్గానికి చెందిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి మొదటి నుంచి చంద్రబాబు అధిక ప్రాధాన్యతిస్తూ వచ్చారు.. సీఎం వైఎస్ జగన్ పై తీవ్రమైన విమర్శలు చేయడంలో సోమిరెడ్డి దిట్ట.. ఆ ఒక్క కారణంతో సోమిరెడ్డి ఐదు సార్లు ఓడిపోయినప్పటికీ ఆయనకి ప్రాధాన్యత ఇచ్చారు టిడిపి పెద్దలు.. అయితే ఇటీవల ఆయన పనితీరుపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతుంది.. టిడిపి అధినేత చేపట్టిన సర్వేల్లో సైతం 2024 ఎన్నికల్లో సోమిరెడ్డికి టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమని తేట తెల్లం అయిందట.. దీంతో ఆయన స్థానంలో మరో కొత్త అభ్యర్థి కోసం టిడిపి పేట ప్రారంభించిందని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుంది..

ఇటీవల మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని నారా లోకేష్ పిలిపించుకున్నారట.. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్న లోకేష్.. పరిస్థితి ఇలాగే ఉంటే వచ్చే ఎన్నికల్లో మీ స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తామని.. మీరు కూడా ఆయన గెలుపు కోసం పని చేయాల్సి ఉంటుందని మోహమాటం లేకుండా చెప్పేశారని సొంత పార్టీలో జోరుగా చర్చ నడుస్తోంది.. ఇప్పటికే సర్వేపల్లి నియోజకవర్గంలోని ముఖ్య నేతలు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.. రోజురోజుకు పార్టీ దిగజారి పోతూ ఉండడంతో వీలైనంత తొందరగా కొత్త అభ్యర్థిని తీసుకొచ్చి సర్వేపల్లి నియోజకవర్గ బాధ్యతను అప్పగించాలని లోకేష్ భావిస్తున్నారట.. మొత్తంగా ఐదుసార్లు ఓడిపోయిన సోమిరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ లేదనే ప్రచారం నెల్లూరులో జరుగుతుంది

Read more RELATED
Recommended to you

Latest news