స్పీన్ మాయాజాలం.. న్యూజిలాండ్ ఆలౌట్

-

టీమిండియా స్పిన్న‌ర్లు న్యూజిలాండ్ ను తిప్పేశారు. టెస్టు మ్యాచ్ లో ఒక వికెట్ కూడా తీయ‌లేక పోయిన టీమిండియా బౌల‌ర్లు.. మూడో రోజు రెచ్చిపోయారు. న్యూజిలాండ్ జ‌ట్టు ను స్పీన్నర్లే కుప్ప కూల్చారు. మూగ్గురు స్పిన్న‌ర్ల కు ఏకంగా తొమ్మిది వికెట్లు ల‌భించాయి. అందులో అక్ష‌ర్ ప‌టేల్ ఏకంగా ఐదు వికెట్లు తీశాడు. అలాగే ర‌విచంద్ర‌న్ అశ్వ‌న్ మూడు వికెట్లు దక్కించుకున్నాడు. అలాగే ర‌వీంద్ర జ‌డేజా ఒక వికెట్ ను సాధించాడు. అలాగే స్పీడ్ బౌలర్ కు కేవ‌లం ఒకే ఒక వికెట్ ల‌భించింది.

ఉమేశ్ యాద‌వ్ కు ఈ ఒక్క వికెట్ ద‌క్కిచుకున్నాడు. అలాగే న్యూజి లాండ్ నుంచి ఓపెన‌ర్ టామ్ లాథ‌మ్ 95 ప‌రుగులు చేశాడు. అలాగే మ‌రొక్క ఓపెన‌ర్ విలియ‌మ్ యంగ్ 89 ప‌రుగులు చేశాడు. త‌ర్వాత వ‌చ్చిన న్యూజిలాండ్ బ్యాట‌ర్లు ఎవ‌రూ కూడా టీమిండియా స్పిన్న‌ర్ల దాటి కి నిల‌వ‌డ లేక పోయారు. దీంతో న్యూజిలాండ్ 296 ప‌రుగుల కు ఆలౌట్ అయింది. దీంతో టీమిండియా కు 49 ప‌రుగుల స్వ‌ల్ప ఆధిక్యం పొందింది. అయితే టీమిండియా మొద‌టి ఇన్నింగ్స్ లో 345 ప‌రుగులు చేసింది. కాగ ఇండియా రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ఓపెన‌ర్ శుభ‌మాన్ గిల్ 1 ప‌రుగే వెనుదిరిగాడు. ప్ర‌స్తుతం పుజారా (9) , మయాంక్ అగర్వాల్ (4) క్రిజ్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news