వచ్చే ఏడాది ఐపీఎల్ మెగాటోర్ని ప్రారంభం కాబోతుంది. రాజస్థాన్ రాయల్స్ వచ్చే 2024 ఐపీఎల్ లో మంచి ఫలితాలను రాబట్టాలంటే ప్రస్తుతం కెప్టెన్గా వ్యవహరిస్తున్నటువంటి సంజూ శామ్సన్ ను తప్పించాలని మాజీ క్రికెటర్ శ్రీశాంత్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం సంజు సామ్సన్ ఫామ్ సరిగాలేదని రాజస్థాన్ రాయల్స్ కి రోహిత్ శర్మ లాంటి అనుభవం కలిగిన ఆటగాడు అవసరమని అన్నాడు. అలాగే రాజస్థాన్ రాయల్స్ కి జోష్ బట్లర్ కెప్టెన్ అయితే బాగుంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం శ్రీశైలం చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.
కాగా సంజు సాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ 45 మ్యాచ్లను ఆడింది. ఇందులో 22 మ్యాచ్లను గెలువగా మిగతా 23 మ్యాచ్ల్లో ఓటమి పాలు అయ్యింది. సంజు సాంసంన్ నాయకత్వంలో రాజస్థాన్ 2022 ఐపీఎల్ సీజన్ లో ఫైనల్ కీ చేరుకోగా, 2023 ఐపీఎల్ సీజన్లో సెమీఫైనల్ కి చేరకుండానే నిష్క్రమించింది.ఇప్పటివరకు సంజు సాంసంన్ 152 ఐపీఎల్ మ్యాచ్లు ఆడగా ఇందులో మూడు శతకాలతో పాటు 20 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అలాగే 3,888 రన్స్ చేశాడు.