తొలి వన్డేలో బోణీ చేసిన భారత్….

-

ఈరోజు ఇండియా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డే లో 8 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సౌత్ ఆఫ్రికా 116 పరుగులకే ఆల్ అవుట్ అయింది. కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 117 పరుగుల లక్ష్యాన్ని చేదించింది. లక్ష్య చేదన లో తొలుత బ్యాటింగ్ కి దిగిన ఋతురాజ్ గైక్వాడ్ కేవలం 5 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ బాట పట్టాడు. ఆ తర్వాత వచ్చిన శ్రేయస్ అయ్యర్ 52 పరుగులు చేశాడు. ఈరోజు వన్డేల్లో అరంగేట్రం చేసిన సాయి సుదర్శన్ 55 పరుగులతో రాణించి భారతికి తొలి విజయాన్ని అందించారు.

 

మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 27.3 ఓవర్లలో 116 పరుగులు మాత్రమే చేయగలిగింది. సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ లో ఫెహ్లుక్వాలియో 33,జార్జి 28,మర్క్రం 12,శంసి 11 పరుగులు మాత్రమే చేశారు. మిగతా బ్యాట్స్ మెన్స్ కేవలం సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ లో ముగ్గురు డక్ అవుట్ గా వెను తిరిగారు. భారత బౌలర్లు లో హర్షిదీప్ సింగ్ 5 వికెట్లు తీయగా ఆవేష్ ఖాన్ నాలుగు వికెట్లు కుల్దీప్ యాదవ్ ఒక వికెట్ తీశారు.అలాగే ఈరోజు టి20ల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన రింక్ సింగ్ వన్డేలో అరంగేట్రం చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news