అమీన్‌పూర్‌ రేప్ ఘటన : అన్నీ చిక్కుముడులే ?

-

హైదరాబాద్‌ నగర శివారు సంగారెడ్డి జిల్లా అమీన్‌ పూర్‌లో మైనర్ బాలిక మీద రేప్ కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసును దర్యాప్తు చేసేందుకు వచ్చిన హైపవర్ కమిటీ ఎన్నో చిక్కుముడులు విప్పాల్సిన పరిస్థితి నెలకొంది. నిజానికి ఈ కేసుకు సంబంధించి జూలై 31న బోయిన్‌పల్లి పీఎస్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదయింది. అదే రోజున కేసును అమీన్‌ పూర్‌ కు బదిలీ చేశారు బోయిన్‌పల్లి పోలీసులు. అలానే అదే రోజున బాలికను భరోసా కేంద్రానికి బోయిన్‌పల్లి పోలీసులు పంపారు. ఆగష్టు 1న కేసును అమీన్‌పూర్‌ పోలీసులు రీ రిజిస్ట్రర్ చేసుకున్నారు.

డీసీపీ ఆగష్టు 6న నిలోఫర్‌ ఆసుపత్రిలో బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసుకున్నారు. ఆగష్టు 7న అమీన్ పూర్ పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. ఈనెల 12న మైనర్ బాలిక మృతి చెందింది. అయితే జీరో ఎఫ్‌ఐఆర్ బదిలీ అయిన తర్వాత కేసు విచారణకు 5 రోజుల సమయం ఎందుకు పట్టింది ? 5రోజుల పాటు అమీన్‌ పూర్ పోలీసులు ఈ కేసులో ఎలాంటి దర్యాప్తు చేశారు ? బాలిక బత్రికి ఉండగానే 164 సెక్షన్ ఎందుకు నమోదు చేయలేదు ? బాలిక చేతనే కేసు ఎందుకు పెట్టించాల్సి వచ్చింది ? బాలిక బంధువులు గాని….సీడబ్ల్యూసీ ఎందుకు కేసు పెట్టలేదు ? లాంటి అనేక చిక్కు ముడులు ఇప్పుడు హైపవర్ కమిటీ ముందు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news