IPL 2023 : డేంజర్ గా మారిన సచిన్ కొడుకు..సిక్సులే సిక్సులు !

-

గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై 55 పరుగులు తేడాతో పరాజయం పారైంది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన MI బ్యాటర్లు తడబడ్డారు. గుజరాత్ బౌలర్ల దెబ్బకు వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. వదేరా 40, గ్రీన్ 33, సూర్యకుమార్ 23 రన్స్ చేయడం మినహా మిగతా బ్యాటర్లు తక్కువ స్కోరుకే వెనుదిరిగారు.

దీంతో ముంబై 152/9 రన్స్ కి పరిమితమైంది. గుజరాత్ బౌలర్లలో నూర్ 3, రషీద్, మోహిత్ చెరో 2, హార్దిక్ ఒక వికెట్ తీశారు. అయితే, ఈ మ్యాచ్‌ లో ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌ లో బౌలర్‌ అయిన అర్జున్‌ టెండూల్కర్‌ సిక్సర్‌ బాదాడు. ఈ సిక్సుతో ఐపీఎల్‌ లో తొలి సిక్సు నమోదు చేసుకుని.. తాను ఆల్‌ రౌండర్‌ అని ఫ్రూవ్‌ చేసుకున్నాడు. బౌలింగ్‌ లోనే కాదు, బ్యాటింగ్‌ లోనూ తగ్గేదేలే అని దూసుకుపోతున్నాడు సచిన్‌ కొడుకు అర్జున్‌ టెండూల్కర్‌.

Read more RELATED
Recommended to you

Latest news