ఇంగ్లండ్‌లోని టాంటన్‌లో ఉన్న ది కూపర్ అసోసియేట్స్ కౌంటీ గ్రౌండ్‌లో ఇవాళ ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 టోర్నీ 17వ మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 49 ఓవర్లలో 307 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో డేవిడ్ వార్నర్ (111 బంతుల్లో 107 పరుగులు, 11 ఫోర్లు, 1 సిక్సర్), కెప్టెన్ ఆరోన్ ఫించ్ (84 బంతుల్లో 82 పరుగులు, 6 ఫోర్లు, 4 సిక్సర్లు)లు రాణించారు. వీరిద్దరూ కలసి తొలి వికెట్‌కు చక్కని భాగస్వామ్యాన్ని అందించడంతో ఓ దశలో ఆస్ట్రేలియా 400 పరుగులు చేస్తుందని అంతా భావించారు. కాన పాక్ బౌలర్లు ఆసీస్‌ను కట్టడి చేశారు. దీంతో ఆ జట్టు 307 పరుగులు మాత్రమే చేయగలిగింది.
ఇక పాక్ బౌలర్లలో మహమ్మద్ అమీర్ 5 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. అలాగే షాహీన్ అఫ్రిదికి 2 వికెట్లు దక్కగా, హసన్ అలీ, వహబ్ రియాజ్, మహమ్మద్ హఫీజ్‌లకు తలా 1 వికెట్ దక్కింది. కాగా వరల్డ్ కప్‌లలో పాకిస్థాన్ జట్టు తరఫున ఒక మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన జాబితాలో మహమ్మద్ అమీర్ చేరిపోయాడు. అంతకు ముందు షాహిద్ అఫ్రిది, వసీం అక్రం, సక్లెయిన్ ముస్తాక్, అబ్దుల్ ఖాదిర్, వహబ్ రియాజ్, సొహెయిల్ ఖాన్‌లు ఈ ఘనత సాధించారు. ఇక మహమ్మద్ అమీర్ ఈ మ్యాచ్‌తో వన్డేల్లో బౌలింగ్‌లో తన వ్యక్తిగతంగా ఉత్తమ గణాంకాలను నమోదు చేశాడు. ఇవాళ ఆసీస్‌తో మ్యాచ్‌లో అమీర్ 30 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లను నేలకూల్చాడు.