ఛీ.. ఛీ.. పాకిస్థాన్ బుద్ధి మారదా ఇక? పైలట్ అభినందన్‌ను కించపరుస్తూ యాడ్..!

ఛీ.. ఛీ.. పాకిస్థాన్ ఇక మారదు. భారత్ హీరోను ఇంతలా కించపరుస్తారా? పాకిస్థాన్ ఆ టీ కప్‌ను మాత్రమే గెలుచుకుంటుందని చెప్పి పాకిస్థానే చెప్పుకుంటోంది.. అంటూ నెటిజన్లు పాక్‌పై ఫైర్ అవుతున్నారు.


పాకిస్థాన్ తోక ఎప్పుడూ వంకరే. దాన్ని సక్కగ చేయాలంటే కష్టమే. అది అసాధ్యం.. అని మరోసారి నిరూపించుకున్నది పాకిస్థాన్. పాక్ చేతిలో బంధీగా ఉన్న వింగ్ కమాండర్ అభినందన్‌ను కించపరుస్తూ పాకిస్థాన్‌కు చెందిన ఓ న్యూస్ చానెల్ యాడ్ తీసింది. ఈ ఆదివారం భారత్, పాకిస్థాన్ మధ్య వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది కదా. దాని కోసమని చానెల్ ఈ యాడ్‌ను రూపొందించింది. అయితే.. ఆ యాడ్‌లో వింగ్ కమాండర్‌ను కించపరిచేలా సీన్లు ఉన్నాయి.

అప్పుడు అభినందన్ పాకిస్థాన్‌కు పట్టుబడిన తర్వాత వాళ్లు అభినందన్‌కు సంబంధించిన ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆయన కప్‌లో టీ తాగుతుండగా.. వాళ్లు ఇండియాకు సంబంధించిన రహస్యాలు అడుగుతుంటారు. అప్పుడు ఆయన సారీ.. నేను ఆ విషయాలేవీ చెప్పలేను.. అని అంటారు. తర్వాత టీ ఎలా ఉంది అని అడుగుతారు. అప్పుడు ఆయన ట్రీ బాగుంది.. అని అంటారు.

ఆ వీడియోను స్పూఫ్ చేసి.. అభినందన్‌లా ఉన్న ఓ వ్యక్తిని ఆదివారం జరగబోయే భారత్, పాక్ మ్యాచ్‌కు సంబంధించి అడుగుతారు. అప్పుడు ఆ వ్యక్తి కూడా సారీ, నేను ఆ విషయాలేవీ మీకు చెప్పలేను.. అని చెబుతాడు. బ్లూ జెర్సీ వేసుకున్న ఆ వ్యక్తిని టీ ఎలా ఉంది అని మళ్లీ అడుగుతారు. దానికి టీ బాగుంది.. అని చెప్పి టీ కప్ కూడా తీసుకొని వెళ్తుండగా.. టీకప్ తీసుకెళ్లకూడదు అంటూ వేరే వ్యక్తి వారించడం ఆ వీడియోలో చూడొచ్చు.

ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇండియన్స్ పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. ఛీ.. ఛీ.. పాకిస్థాన్ ఇక మారదు. భారత్ హీరోను ఇంతలా కించపరుస్తారా? పాకిస్థాన్ ఆ టీ కప్‌ను మాత్రమే గెలుచుకుంటుందని చెప్పి పాకిస్థానే చెప్పుకుంటోంది.. అంటూ నెటిజన్లు పాక్‌పై ఫైర్ అవుతున్నారు.