హెలికాప్టర్ లో స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్

-

ఆస్ట్రేలియా క్రికెట్‌లో ఓ శకం ముగిసింది. స్టార్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ టెస్టులకు, వన్డేలకు వీడ్కోలు పలికాడు. పాకిస్తాన్‌ తో మూడో టెస్టు అనంతరం సుదీర్ఘ ఫార్మట్‌ నుంచి డేవిడ్‌ భాయ్‌ తప్పుకొన్నాడు. ఆ సమయంలోనే వన్డేలకు కూడా గుడ్‌ బై చెప్పేశాడు. అయితే వార్నర్ ప్రస్తుతం బిగ్‌బాష్ లీగ్‌లో ఆడుతున్నాడు. అయితే హెలికాప్టర్ లో స్టేడియంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్.

హాలీవుడ్ హీరో రేంజ్ లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ కు ఎంట్రీ ఇచ్చాడు. బిగ్ బాష్ లీగ్ 2023-24లో భాగంగా సిడ్నీ థండర్, సిడ్నీ సిక్సర్స్ మధ్య మ్యాచ్ కోసం చాపర్ లో వచ్చిన వార్నర్. 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న తన సోదరుడి పెళ్లికి వెళ్లిన వార్నర్.. చివరి నిమిషంలో మ్యాచ్ కోసం హెలికాప్టర్ లో ఎంట్రీ ఇచ్చాడు. తాను ఎక్కడైతే కెరీర్లో చివరి టెస్ట్ ఆడాడో.. అదే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ లో .. థ్యాంక్స్ డేవ్ అని తనకు ఫేర్‌వెల్ చెప్పిన చోటే చాపర్ లో దిగిన వార్నర్.క్రికెట్ లో హిస్టరీ లో ఇలాంటి ఎంట్రీ తొలిసారి జరిగింది. సాధారణంగా ఏ మ్యాచ్ ఆడాల్సి ఉన్నా ప్లేయర్స్ కొన్ని గంటల ముందుగానే స్టేడియానికి చేరుకుని ప్రాక్టీస్ చేసి సిద్ధంగా ఉంటారు. కానీ డేవిడ్ వార్నర్ మాత్రం ఇలా మ్యాచ్ కు ఆలస్యమవుతోందంటూ ఏకంగా హెలికాప్టర్ లో నేరుగా గ్రౌండ్ లోనే దిగడం విశేషం.

 

Read more RELATED
Recommended to you

Latest news