క్రికెట్ ఫాన్స్ కి బ్యాడ్ న్యూస్…

-

ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఇప్పుడు విస్తరిస్తుంది. దీనితో కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి అన్ని విధాలుగా ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇది పక్కన పెడితే కరోనా వైరస్ కారణంగా ఐపిఎల్ ని వాయిదా చేసింది బీసీసీఐ. ఈ టోర్నీ ఎప్పుడు జరుగుతుంది అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. జూన్ లో నిర్వహిస్తారు అనే వార్తలు వస్తున్నాయి. అయితే అది కూడా సాధ్యం కాదని అంటున్నారు.

కరోనా వైరస్ ప్రభావంతో అక్టోబర్, నవంబర్‌లో జరిగే టీ 20 వరల్డ్ కప్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ టోర్నీ ఆస్ట్రేలియాలో జరగనుంది. అయితే అక్కడ కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విస్తరిస్తుంది. దీనితో ఆస్ట్రేలియాలో లాక్ డౌన్ ని ఆరు నెలల పాటు అమలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఇప్పుడు దాని ప్లేస్ లో ఐపిఎల్ ని నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ భావిస్తుంది.

ఇప్పట్లో భారత్ లో ఐపిఎల్ నిర్వహించే అవకాశాలు కనపడట౦ లేదు. కరోనా ప్రభావం ఇప్పట్లో అదుపులోకి వచ్చే అవకాశం కనపడటం లేదు. దీనితో క్రికెట్ టోర్నీలు అన్నీ కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. టి20 వరల్డ్ కప్ నిర్వహించే అవకాశాలు లేవు కాబట్టి… మినీ ఐపిఎల్ లేదా ఐపిఎల్ పూర్తి స్థాయిలో నిర్వహించే ప్లాన్ చేస్తున్నారు. దీనిపై త్వరలోనే నిర్ణయం వెల్లడించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అంటే నవంబర్ లో ఐపిఎల్ ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news