ఆసియా కప్ వేదికపై నిర్ణయం అప్పుడే: బీసీసీఐ కార్యదర్శి జై షా

-

ఐసీసీ షెడ్యూల్ ప్రకారం ఇదే సంవత్సరం ఆసియా కప్ పాకిస్తాన్ లో జరగాల్సి ఉంది. కానీ పాకిస్తాన్ లో ఆడదానికి ఇండియా సుకుఖంగా లేకపోవడంతో ఆసియా క్రికెట్ కౌన్సిల్ లో ఈ టోర్నీని శ్రీలంక కు మార్చాలని నిర్ణయం తీసుకోగా, పాకిస్తాన్ ఆగ్రహముతో ఉంది. దీనిపై ప్రస్తుతం సందిగ్దత నెలకొంది, కేంద్రం అనుమతి లేకుండా ఇండియా ను పాకిస్తాన్ కు పంపద్దని చెప్పడంతో సస్పెన్స్ నెలకొంది. అయితే ఈ విషయంపై తాజాగా బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక కామెంట్ చేశాడు. ప్రస్తుతం బీసీసీఐ ఐపీఎల్ గురోయించి మాత్రమే ఆలోచిస్తోందని, ఐపీఎల్ తర్వాతనే ఆసియా కప్ లో ఇండియా వేదిక గురించి మాట్లాడుతామని షా పేర్కొన్నారు.

మరి దీనిపై బీసీసీఐ , పాకిస్తాన్ లు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సి ఉంది. కాగా ప్రస్తుతం ఐపీఎల్ చివరి దశకు చేరుకుంది, ఈ రోజు క్వాలిఫైయర్ 2 మ్యాచ్ గుజరాత్ మరియు ముంబై ల మధ్య జరగనుంది

 

 

Read more RELATED
Recommended to you

Latest news