బేబీ బంప్ ఫోటోలతో మరోసారి రచ్చ చేసిన ఇలియానా..!

-

ప్రముఖ గోవా బ్యూటీ ఇలియానా మరొకసారి బేబీ బంప్ ప్రదర్శించి రచ్చ చేసింది. అసలే పెళ్లి కూడా చేసుకోలేదు.. పైగా ప్రెగ్నెంట్ అంటూ ఇంస్టాగ్రామ్ లో ప్రకటించిన ఈ ముద్దుగుమ్మ ఒక ప్రకటనతో ఇండస్ట్రీ మొత్తం ఆశ్చర్యపోయింది. ఇక ఈమె ప్రకటించిన వెంటనే ఏదైనా సినిమా ప్రమోషన్స్ కోసం అలా చేసిందా ? లేక నిజంగానే గర్భవతి అయ్యిందా ?.. ఒకవేళ ఈమె గర్భవతి అయిందంటే మరి పుట్టబోయే పాపా లేదా బాబుకు తండ్రి ఎవరు? అంటూ రకరకాల కామెంట్లు వినిపించారు కానీ ఏమి మాత్రం స్పందించకుండా తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది.

గోవా బ్యూటీ ఇలియానా విషయానికి వస్తే.. నడుము నాజూకు అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా పేరుగాంచింది. టాలీవుడ్ లో కెరియర్లో దూసుకుపోతున్న సమయంలోనే తప్పుడు నిర్ణయాలు తీసుకొని కెరియర్ను నాశనం చేసుకుంది. టాలీవుడ్ లో వస్తున్న అవకాశాలను కాలదన్ని బాలీవుడ్లో దున్నేయాలని బయలుదేరడంతో అక్కడ చుక్కెదురు తప్పలేదు. దీంతో కెరియర్ కూడా ట్రాక్ తప్పి అవకాశాలు తగ్గిపోయాయి. ఆ తర్వాత లవ్ ఎఫైర్ , బ్రేకప్ వంటి వ్యవహారాలు ఈమెను మరింత కుంగదీసాయని చెప్పాలి.

ఇక ప్రస్తుతం అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా బేబీ బంప్ తో కనిపించి అందరినీ ఆశ్చర్యాన్నికి గురిచేసింది. గతంలో కత్రినా కైఫ్ సోదరుడు సెభాష్టియన్ తో సహజీవనం చేస్తుందని వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు తాను గర్భవతి అన్న విషయాన్ని రివీల్ చేయలేదు. ఇక ఇటీవల ఏకంగా బేబీ బంప్ తో కనిపించి ఆశ్చర్యానికి గురిచేసింది తాజాగా బేబీ బంప్ తో ఉన్న మిర్రర్ సెల్ఫీ పిక్స్ ని పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. పైగా స్ట్రైట్ గా ఉన్న ఫోటోలో ఆమె నార్మల్ గా కనిపించి సైడ్ యాంగిల్ లో ఉన్నప్పుడు బేబీ బంప్ తో కనిపించింది. ఇక అంతా యాంగిల్స్ లోనే ఉంది అంటూ బోల్డ్ గా కామెంట్లు చేసింది ఇలియానా. మొత్తానికైతే ఇలియానా గర్భానికి కారణం ఎవరన్నది తెలియ రాలేదు.

Read more RELATED
Recommended to you

Latest news