మిస్టరీ స్పిన్నర్ గా పేరున్న నరైన్ లోని హిట్టర్ ను క్రికెట్ ఫ్యాన్స్ కు పరిచయం చేసింది గౌతమ్ గంభీర్. కేకేఆర్ కు గౌతి కెప్టెన్ గా ఉన్న సమయంలో ఎవరి అంచనాలకు అందకుండా నరైన్ తో ఓపెనింగ్ చేయించి హిట్ అయ్యారు. గౌతీ జట్టును వీడాక అతడిని అంతగా పట్టించుకోలేదు.
ఈ సీజన్ లో కేకేఆర్ మెంటార్ గా వచ్చిన గౌతి తిరిగి నరైన్ కు ఓపెనర్ గా అవకాశం కల్పించారు. దీంతో ఏకంగా సెంచరీ బాధి తనపై ఉన్న నమ్మకాన్ని నరైన్ నిలబెట్టుకున్నారు. అయితే.. గతంలో బీజేపీ ఎంపీగా గౌతమ్ గంభీర్ పని చేయడంతో.. అందరూ నరైన్ విధ్వంసానికి బీజేపీ కారణమంటూ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా, కేకేఆర్ జట్టుపై ఒంటరి పోరాటం చేసి రాజస్థాన్ జట్టుకు సూపర్ విక్టరీ అందించిన బట్లర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆత్మవిశ్వాసంతో ధోని అలాగే కోహ్లీ చివరి వరకు ఉండి పోరాడుతారని… ఈ మ్యాచ్ లో కూడా తాను అదే చేశానని తెలిపారు బట్లర్. నాకు గతంలో సంఘకర కూడా ఇదే విషయాన్ని తెలిపారని వివరించారు.