జగన్‌పై దాడి.. చిత్ర పరిశ్రమ స్పందించదా?..టాలీవుడ్ పై RGV ఫైర్

-

విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి ఘటనపై టాలీవుడ్ ఇండస్ట్రీస్ స్పందించకపోవడం గమనార్హం అంటూ దర్శకుడు RGV ట్వీట్ చేశారు. ‘ఇండస్ట్రీ టాక్సులు, బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకోవడం, భూముల కోసం జగన్ కావాలి.

RGV fire on Tollywood

కానీ ఆయనపై దాడి జరిగితే మాత్రం సినిమా వాళ్లకు అవసరం లేదా? ఒక ట్వీట్ కూడా చేయాలని అనిపించలేదా? ఇండస్ట్రీ నుంచి కనీస స్పందన లేకపోవడం దారుణం’ అని ఓ రిపోర్టర్ మాట్లాడిన వీడియోను RGV పంచుకున్నారు.

కాగా, సీఎం జగన్ పై రాయి దాడి కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీఎం జగన్ పై దాడి చేసింది నేనే అంటూ ఒప్పుకున్నాడు మైనర్ సతీష్‌. ఇటీవలే సీఎం జగన్ పై జరిగిన రాయి దాడి కేసులో పోలీసుల ఆరుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.అయితే దాంట్లో ఒక మైనర్ నేనే సీఎం జగన్ పై దాడి చేసానని ఒప్పుకున్నాడు. ఇక అటు యువకులను అరెస్ట్ చేయటంతో ఆందోళనకు దిగారు తల్లిదండ్రులు. అన్యాయంగా తమ కుర్రాళ్లను అరెస్ట్‌ చేశారని..పోలీసులపై ఫైర్‌ అవుతున్నారు తల్లిదండ్రులు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news