Breaking : చెన్నై కెప్టెన్‌గా మళ్లీ ఎంఎస్‌ ధోనీ.. కెప్టెన్సీ నుంచి తప్పుకున్న జడేజా

-

ఐపీఎల్ 2022 సీజన్‌ను ఎన్నో ఆశలు, అంచనాలతో మొదలెట్టాడు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా. సీజన్ ఆరంభానికి రెండు రోజుల ముందు కెప్టెన్సీ నుంచి ఎమ్మెస్ ధోనీ తప్పుకోవడంతో, సీఎస్‌కే కెప్టెన్‌గా చక్రం తిప్పాలని భావించాడు. అయితే ఆ ముచ్చట కొన్ని రోజుల్లోనే మాయమైంది… కేకేఆర్‌తో మొదటి మ్యాచ్‌లో చిత్తుగా ఓడిన చెన్నై సూపర్ కింగ్స్, ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది.

కెప్టెన్సీ భారం కారణంగా తన సహజమైన ఆటకు దూరమైన రవీంద్ర జడేజా… అటు బ్యాటుతో కానీ ఇటు బంతితో కానీ చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. దీంతో చెన్నై కెప్టెన్‌ పగ్గాలు మళ్లీ ఎంఎస్‌ ధోనీ చేతికి వెళ్లాయి. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు జడేజా వెల్లడించారు. ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడి రెండు మ్యాచుల్లో మాత్రమే చెన్నై విజయం సాధించింది. దీంతో వరుస ఓటములతో విమర్శలు ఎదర్కుంటున్న జడేజా కెప్టెన్సీ వదులుకున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version