బుమ్రా.. భారత్ తురుపుముక్క‌.. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇత‌ర దేశాల బ్యాట్స్‌మెన్ల‌కు ద‌డ పుట్టిస్తాడా..?

-

జ‌స్‌ప్రిత్ బుమ్రా.. ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో బౌలింగ్‌లో నంబ‌ర్ వ‌న్ స్థానంలో కొన‌సాగుతున్నాడు. అయితే అందుకు త‌గిన‌ట్లుగానే బుమ్రా నిన్న‌టి మ్యాచ్‌లో బౌలింగ్ చేశాడ‌ని చెప్ప‌వ‌చ్చు.

ఐసీసీ వ‌ర‌ల్డ్ క‌ప్ 2019 టోర్నీలో భార‌త్ లేటుగా ఎంట్రీ ఇచ్చినా త‌న తొలి మ్యాచ్‌లోనే విజ‌యం సాధించి.. ఈ టోర్న‌మెంట్‌లో బోణీ కొట్టింది. అటు బౌలింగ్‌, ఇటు బ్యాటింగ్‌.. మ‌రోవైపు ఫీల్డింగ్‌లోనూ రాణించిన భార‌త ఆట‌గాళ్లు సౌతాఫ్రికాపై సునాయాసంగా విజ‌యం సాధించారు. సాధించాల్సింది త‌క్కువ ల‌క్ష్య‌మే అయిన‌ప్ప‌టికీ నెమ్మ‌దిగా ప‌రుగులు చేస్తూ.. ఇన్నింగ్స్ నిర్మించి ల‌క్ష్యాన్ని ఛేదించారు. అయితే భార‌త్‌కు ఇది సాధార‌ణ విజ‌య‌మే అయినా.. ఈ మ్యాచ్ మాత్రం బౌల‌ర్ బుమ్రాకు ప్ర‌త్యేకం. ఎందుకంటే..?

జ‌స్‌ప్రిత్ బుమ్రా.. ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్‌లో బౌలింగ్‌లో నంబ‌ర్ వ‌న్ స్థానంలో కొన‌సాగుతున్నాడు. అయితే అందుకు త‌గిన‌ట్లుగానే బుమ్రా నిన్న‌టి మ్యాచ్‌లో బౌలింగ్ చేశాడ‌ని చెప్ప‌వ‌చ్చు. అత‌ను తీసింది రెండు వికెట్లే అయిన‌ప్ప‌టికీ అతను వేసిన బంతులు మాత్రం అద్భుతం. పేస్ బౌలింగ్‌ను స‌మ‌ర్థ‌వంతంగా ఆడే జ‌ట్ల‌లో ఒక‌టైన సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్‌కే బుమ్రా త‌న ప‌దునైన బంతుల‌తో ద‌డ పుట్టించాడు. ఓపెనర్లుగా వ‌చ్చిన హ‌షీం ఆమ్లా, డికాక్‌ల‌ను ఔట్ చేసి భార‌త్‌కు మ్యాచ్ ఆరంభంలోనే చ‌క్క‌ని బ్రేక్ ఇచ్చాడు. ఇది జ‌ట్టులో ఆత్మ‌విశ్వాసాన్ని నింపింది. దీంతో ఇత‌ర బౌల‌ర్లు కూడా చెల‌రేగిపోయారు. ఎప్ప‌టిక‌ప్పుడు వికెట్ల‌ను తీస్తూ సౌతాఫ్రికా బ్యాటింగ్‌కు అడ్డుక‌ట్ట వేశారు. ఫ‌లితంగా ఆ జ‌ట్టు త‌క్కువ స్కోరు న‌మోదు చేసింది. ప‌రాజ‌యం పాలైంది.

అయితే బుమ్రా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆడ‌డం ఇదే ప్ర‌థ‌మం అయిన‌ప్ప‌టికీ.. అత‌ని బౌలింగ్‌ను చూస్తే మాత్రం.. ఎన్నో వ‌ర‌ల్డ్‌క‌ప్‌లు ఆడిన సీనియ‌ర్ బౌల‌ర్‌లా మ‌న‌కు క‌నిపించాడు. అదే బుమ్రాలో ఉన్న గొప్ప‌త‌నం. నిజానికి అత‌ను భార‌త‌జ‌ట్టుకు దొరికిన తురుపు ముక్క అని చెప్ప‌వ‌చ్చు. ఇక టోర్న‌మెంట్‌లో మిగిలిన మ్యాచ్‌ల‌లో అత‌ను ఎలా బౌలింగ్ చేస్తాడ‌నేది చూడాలి. త‌న ప‌దునైన బంతులతో ఇత‌ర దేశాల బ్యాట్స్‌మెన్‌కు మళ్లీ.. మ‌ళ్లీ.. ద‌డ పుట్టిస్తాడా, లేదా అన్న‌ది.. భార‌త్ ఆడే మ‌రిన్ని మ్యాచ్‌లు చూస్తే మ‌న‌కు తెలుస్తుంది. అయితే ఒక్క‌టి మాత్రం నిజం.. మొద‌టి మ్యాచ్‌లోనే త‌క్కువ ప‌రుగులు ఇచ్చి రెండు బ‌ల‌మైన వికెట్ల‌ను తీసిన బుమ్రా ఈ టోర్న‌మెంట్‌లో బెస్ట్ బౌల‌ర్ క‌చ్చితంగా అవుతాడు. అందులో ఎలాంటి సందేహం లేదు..!

Read more RELATED
Recommended to you

Exit mobile version