హాకీ ఇండియాలో క‌రోనా క‌ల‌క‌లం.. 16 మంది ఆట‌గాళ్ల‌కు పాజిటివ్

-

క‌రోనా వైర‌స్ ప్ర‌తాపం చూపిస్తుంది. ఈ మ‌హ‌మ్మారి వ‌ల్ల అనేక రంగాల‌పై ప్ర‌భావం చూపుతుంది. తాజా గా హాకీ ఇండియా పై క‌రోనా కోరాలు చాపింది. ఏకంగా 16 మంది సీనియ‌ర్ హాకీ ఆట‌గాళ్ల తో పాటు ఒక కోచ్ కు క‌రోనా పాజిటివ్ అని తెలింది. కాగ హాకీ ఆట‌గాళ్లు అంద‌రూ త్వ‌ర‌లో సౌత్ ఆఫ్రికాలో జ‌ర‌గ‌బోయే ఎఫ్ఐహెచ్ ప్రొ లిగ్ లో ఆడ‌టానికి ప్ర‌స్తుతం శిక్ష‌ణ తీసుకుంటున్నారు. జాతీయ సెంట‌ర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ లో ఉండి ఆట‌గాళ్లు అంద‌రూ శిక్ష‌ణ తీసుకుంటున్నారు.

అయితే శుక్ర‌వారం వీరికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు చేశారు. అక్క‌డ మొత్తం 128 మందికి క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. మొత్తం 33 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయింది. ఇందులో 16 మంది సీనియ‌ర్ హాకీ ఇండియా ఆట‌గాళ్ల‌తో పాటు ఒక కోచ్ కూడా ఉన్నారు. అయితే క‌రోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయిన ఆట‌గాళ్లు, కోచ్ ల‌కు ల‌క్ష‌ణాలు లేవని సాయ్ తెలిపింది. పూర్తి ఆరోగ్యంతో కూడా ఉన్నార‌ని తెలిపింది. అలాగే ఒక సీనియ‌ర్ మ‌హిళా హాకీ ప్లేయ‌ర్ తో పాటు 15 మంది జూనియ‌ర్ మ‌హిళా ప్లేయ‌ర్ల కు కూడా క‌రోనా పాజిటివ్ అని తెలింది. కాగ ప్ర‌స్తుతం వీరంతా.. ఐసోలేష‌న్ లో ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news