ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకంలో కీలక మార్పులుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లోని వారికి రెండు వాయిదాల్లో ఓటీఎస్ కట్టే వెసులుబాటు కల్పిస్తూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఓటీఎస్ కింద చెల్లించాల్సిన రుసుములుకు సంబంధించిన సవరణలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
రుణం తీసుకుని చెల్లించకున్నా, అలాంటి ఆస్తి చేతులు మారినా ఒకే స్లాబ్ వర్తింపు జేస్తూ తీసుకున్న తీర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.10 వేలు, నగర పంచాయతీలు, పట్టణాల్లో రూ.15వేలు, నగరపాలక సంస్ధల్లో రూ.20వేలుగా ఓటీఎస్ ఛార్జీలను సవరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని ఆమోదించింది మంత్రి మండలి. గరిష్ట సంఖ్యలో పేదలు లబ్ధి పొందేందుకు వీలుగా ఈ సవరణలు చేసినట్లు పేర్కొంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం. అలాగే.. అగ్ర వర్ణ మహిళల కోసం…ఈబీసీ స్కీమ్ కు కూడా ఏపీ కేబినేట్ ఆమోదం తెలిపింది.