విరాట్​ కోహ్లీ బర్త్ డే.. స్వీట్ పిక్స్​తో విషె చేసిన వైఫీ అనుష్క

-

రన్ మెషీన్.. టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బర్త్ డే ఇవాళ. కేవలం కోహ్లీయే కాకుండా.. ప్రపంచమంతా ఇవాళ ఈ ఆటగాటి పుట్టిన రోజు వేడుకలు సెలబ్రేట్ చేసుకుంటోంది. క్రికెటర్స్.. మూవీ స్టార్స్.. రాజకీయ ప్రముఖులు.. సామాన్య ప్రజలు.. అంతా విరాట్​కు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. సోషల్ మీడియా మొత్తం విరాట్ కోహ్లీ ఫొటోలు, వీడియోలతో హోరెత్తుతోంది.

విరాట్ కోహ్లీ బర్త్ డే సందర్భంగా అతడి భార్య అనుష్క స్వీట్ విషెస్ చెప్పింది. ఇన్​స్టాగ్రామ్ వేదికగా విరాట్ ఫన్నీ, క్యూట్ పిక్స్ షేర్ చేసి స్వీట్​గా బర్త్ డే విష్ చేసింది. న‌వ్వులు పూయిస్తున్న ఆ ఫొటోల్లో కోహ్లీ చిన్న‌పిల్లాడిలా తెగ ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ ఫొటోల‌కు అనుష్క ఓ క్యాప్ష‌న్ కూడా ఇచ్చింది. “మై ల‌వ్‌, ఇవాళ నీ పుట్టిన రోజు. అందుకే కొన్ని ఫొటోల‌ను పోస్టు చేస్తున్నాన‌ు, చాలా ఫ‌న్నీగా ఉండే ఫొటోలు ఉన్నాయి, నువ్వు ఎలా ఉన్నా.. నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను” అంటూ అనుష్క పోస్ట్ చేసింది.

వైఫీ అనుష్క బర్త్ డే విషెస్​కి విరాట్ క్యూట్​గా స్పందించాడు. ఎరుపు రంగులోని హార్ట్ ఎమోజీల‌ను కొన్ని పోస్టు చేశాడు. మ‌రో క్రికెట‌ర్ డివిలీర్స్ కూడా ఆ పోస్టుపై రియాక్ట్ అయ్యాడు. ‘ఆ ఫేస్ చూడాల్సిందే’ అంటూ కొన్ని లాఫింగ్ ఎమోజీల‌ను పోస్టు చేశాడు. హ్యాపీ బ‌ర్త్‌డే కింగ్ అంటూ ఓ అభిమాని పోస్టు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news