క్రికెట్ మ్యాచ్‌లలో అప్పుడప్పుడు వింతైన సంఘటనలు చోటు చేసుకుంటుంటాయి. బ్యాట్స్‌మెన్లు చిత్రంగా అవుట్ అవుతుంటారు. తాజాగా ఆస్ట్రేలియా డొమెస్టిక్ లీగ్ బిగ్ బ్యాష్ టోర్నీలోనూ వింతైన సంఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాట్స్‌మెన్ ఒకే బంతికి రెండు సార్లు రనౌట్ అయ్యాడు.
ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌లో అడిలైడ్ స్ట్రైకర్స్‌కు, సిడ్నీ థండర్స్‌కు మధ్య ఆదివారం బిగ్‌బ్యాష్ లీగ్ టీ20 మ్యాచ్ జరిగింది. అందులో అడిలైడ్ టీం టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో టీం ఇన్నింగ్స్ 10వ ఓవర్ సందర్భంగా ఫిల్ సాల్ట్ అనే బ్యాట్స్‌మన్ సిడ్నీ టీంకు చెందిన క్రిస్ గ్రీన్ వేసిన బంతికి ఎదుర్కొన్నాడు. ఫిల్ సాల్ట్ బంతిని నేరుగా ఆడాడు. దీంతో క్రిస్ గ్రీన్ చేతులకు తాకుతూ బంతి నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న వికెట్లను తాకింది. అయితే దానికి ఆ ఎండ్‌లోనే ఉన్న వెదరాల్డ్ అవుటయ్యాడు. ఆ విషయం అప్పుడు అతనికి తెలియదు.
One batsman, run out at both ends off the same delivery! Too bad Sam Billings' sensational effort won't go in the record-books.
🎥 Cricket Australia pic.twitter.com/1MRKFFHiPE
— The Field (@thefield_in) January 24, 2021
ఇక రనౌట్ గురించి తెలియని వెదరాల్డ్ వికెట్ కీపర్ ఎండ్‌కు రన్ కోసం యత్నించాడు. అయితే అక్కడ వికెట్ కీపర్ అతన్ని ఔట్ చేశాడు. దీంతో ఒకే బంతికి వెదరాల్డ్ రెండు సార్లు ఔట్ అయ్యాడు. అయితే నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో బౌలర్ చేతికి తగిలిన బంతి వికెట్లను తాకినప్పుడే వెదరాల్డ్ అవుటయ్యాడు కనుక దానికే థర్డ్ అంపైర్ అతన్ని రనౌట్‌గా ప్రకటించాడు. కాగా వెదరాల్డ్ ఇలా ఒకే బంతికి రెండు సార్లు రనౌట్ అయిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.