వివాదంలో బీసీసీఐ.. ఆట‌గాళ్ల‌ ఫుడ్ మెనూ పై అభిమానుల ఆగ్ర‌హం

-

బీసీసీఐ తీసుకున్న నిర్ణయంతో వివాదం రాజుకుంది. టీమిండియా అభిమానుల నుంచి ఆగ్ర‌హ జ్వాల‌ల‌ను అందుకుంటుంది. అభిమాను లే కాకుండా ప‌లువురు కూడా బీసీసీఐ నిర్ణ‌యాన్ని త‌ప్పు ప‌డుతున్నారు. అయితే బుధ వారం నుంచి న్యూజిలాండ్ టీమిండియా మ‌ధ్య టెస్టు సిరీస్ జ‌ర‌గ‌బోతుంది. అయితే ఈ మ్యాచ్ ల స‌మ‌యం లో టీమిండియా ఆట‌గాళ్లుకు సిబ్బందికి ప్ర‌త్యేక ఫుడ్ మెనూ ను త‌యారు చేసింది.

ఆ మెనూ లో హాలాల్ చేసిన మాంసం మాత్ర‌మే ఆట‌గాళ్లు, సిబ్బంది తినాల‌ని బీసీసీఐ త‌న ఫుడ్ మెనూ లో పొందుప‌ర్చింది. దీంతో ప‌లువురు బీసీసీఐ ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అలాగే ప్ర‌స్తుతం ఈ మెనూ కు సంబంధించిన వార్త సోష‌ల్ మీడియా ల లో వైర‌ల్ అవుతుంది. బీసీసీఐ హాలాల్ మంసాన్ని ప్రొత్సహిస్తుందని ఆ మంసాన్ని ప్ర‌మోట్ చేస్తుందంటు సోష‌ల్ మీడియా ల‌లో మీమ్స్ చేస్తున్నారు. దీంతో బీసీసీఐ మ‌రో వివాదం లో చిక్కుకుంద‌ని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news