కోహ్లి.. ధోనీని చూసి నేర్చుకో.. ఫ్యాన్స్ మండిపాటు..

సోష‌ల్ మీడియాలో భార‌త క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి నెటిజ‌న్ల నుంచి సెగ త‌గులుతోంది. కోహ్లి తీరుపై భార‌త క్రికెట్ ఫ్యాన్స్ మండిప‌డుతున్నారు. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ ముగిసిన అనంత‌రం టీమిండియా ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌కు బ‌యల్దేరిన సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగా ఆస్ట్రేలియాతో ఇండియా వ‌న్డేలు, టీ20లు, టెస్టులు ఆడ‌నుంది. అయితే టెస్ట్ మ్యాచ్‌ల‌కు మాత్రం కోహ్లి అందుబాటులో ఉండ‌డం లేదు.

cricket fans fire on virat kohli for taking paternity leave

కోహ్లి భార్య అనుష్క శ‌ర్మకు జ‌న‌వ‌రిలో డెలివ‌రీ ఉంది. దీంతో కోహ్లి ఆ కార‌ణం చెప్పి బీసీసీఐని పెట‌ర్నిటీ లీవ్ అడ‌గ్గా.. వారు సెల‌వు మంజూరు చేశారు. దీంతో కోహ్లి ఆస్ట్రేలియాతో జ‌రిగే టెస్టుల‌కు అందుబాటులో ఉండ‌డం లేదు. అయితే ఇదే విష‌యంపై నెటిజ‌న్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కోహ్లికి దేశం క‌న్నా కుటుంబ‌మే ముఖ్య‌మా ? అని ఫైర‌వుతున్నారు.

2015 వ‌ర‌ల్డ్ క‌ప్ స‌మ‌యంలో ధోనీ త‌న భార్య సాక్షి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చినా ఆ స‌మ‌యంలో అత‌ను లీవ్ తీసుకోలేద‌ని, వ‌ర‌ల్డ్ క‌ప్ ఆడాడ‌ని, ధోనీని చూసి కోహ్లి ఎంతో నేర్చుకోవాల‌ని అభిమానులు అంటున్నారు. కోహ్లికి దేశం క‌న్నా కుటుంబమే ముఖ్య‌మై పోయింది, ఏం చేస్తాం.. అని కొంద‌రు ఫ్యాన్స్ అంటున్నారు. ఈ క్ర‌మంలో కోహ్లిని నెటిజ‌న్లు పెద్ద ఎత్తున విమ‌ర్శిస్తున్నారు. అయితే మ‌రికొంద‌రు మాత్రం ఈ విష‌యంలో కోహ్లికి మ‌ద్ద‌తుగా నిలుస్తుండ‌డం విశేషం.