క్రికెట్: ఆ ఇద్దరు సీనియర్లలో హెడ్ కోచ్ పదవి ఎవరికి లభిస్తుందో..?

భారత క్రికెట్ జట్టులో చాలా మార్పులు వచ్చేలా కనిపిస్తున్నాయి. టీ20 కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వైదొలుగుతానని చెప్పడం, అలాగే భారత హెడ్ కోచ్ రవిశాస్త్రి పదవీ కాలం ముగిసిపోవడంతో భారత క్రికెట్ జట్టులో చాలా మార్పులు కనిపించబోతున్నాయి. అటు టీ20 జట్టుకు సారథ్యం వహించేది ఎవరనే విషయం ఇంకా తేలలేదు. ఇటు భారత హెడ్ కోచ్ గా ఎవరు ఉండనున్నారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి ఇద్దరు సీనియర్ల పేర్లు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ఇద్దరే అనిల్ కుంబ్లే, వీవీఎస్ లక్ష్మణ్.

2016- 17ప్రాంతానికి అనిల్ కుంబ్లే భారత జట్టుకు కోచ్ గా వ్యవహరించారు. అలాగే వీవీఎస్ లక్ష్మణ్, ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదారాబాద్ జట్టుకు చాలా ఏళ్ళుగా మెంటార్ గా చేస్తున్నారు. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరికి భారత హెడ్ కోచ్ పదవి లభిస్తుందని తెలుస్తుంది. మరి ఆ అదృష్టం ఎవరికి దక్కుతుందో చూడాలి.