డీఆర్ఎస్ అంటే.. డెఫినిట్లీ రోహిత్ సిస్ట‌మ్ : సునీల్ గ‌వ‌స్క‌ర్

-

వెస్టిండీస్ తో మ‌ధ్య జ‌రిగిన తొలి వ‌న్డేలో టీమిండియా భారీ విజ‌యం న‌మోదు చేసిన విషయం తెలిసిందే. కాగ రోహిత్ శ‌ర్మ తొలి కెప్టెన్సీ మ్యాచ్ విజ‌యం సాధించ‌డంతో రోహిత్ శ‌ర్మకు మాజీలు అభినంద‌న‌లు తెలుపుతున్నారు. తాజా గా మాజీ క్రికెట‌ర్ సునీల్ గ‌వ‌స్క‌ర్ రోహిత్ శ‌ర్మ పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. అలాగే డీఆర్ఎస్ కు సునీల్ గ‌వ‌స్క‌ర్ కొత్త పేరు కూడా పెట్టారు. ఇప్ప‌టి వ‌ర‌కు డీఆర్ఎస్ కు ధోని రివ్యూ సిస్ట‌మ్ అని ఉండేద‌ని.. కానీ ఇప్పుడు డెఫినిట్లీ రోహిత్ సిస్ట‌మ్ గా మారింద‌ని సునీల్ గ‌వ‌స్క‌ర్ అన్నారు.

కాగ తొలి వ‌న్డే మ్యాచ్ లో 22 వ ఓవర్లో స్పిన్న‌ర్ చాహ‌ల్ బౌలింగ్ చేస్తున్న స‌మ‌యంలో వెస్టిండీస్ బ్యాట్స్ మెన్ బ్రూక్స్ కీప‌ర్ క్యాచ్ కు అవుట్ అయ్యాడు. కాగ ఈ అవుట్ తొలత అంప‌ర్ కు అప్పిల్ చేయ‌గా.. నాటౌట్ గా ప్ర‌క‌టించాడు. అయితే కెప్టెన్ రోహిత్.. వికెట్ కీప‌ర్ పంత్ అడ‌గ్గా.. స్ప‌ష్టంగా లేద‌ని అన్నాడు. కోహ్లి సూచ‌న‌తో డీఆర్ఎస్ కు వెళ్లిన రోహిత్ స‌క్స్ అవుతాడు. దీంతో డీఆర్ఎస్ అంటే డెఫినిట్లీ రోహిత్ సిస్ట‌మ్ అంటూ సునీల్ గ‌వ‌స్క‌ర్ కామెంట్ చేశాడు. దీంతో అభిమానులు కూడా డీఆర్ఎస్ ను అలాగే పిలుస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news