డైలాగ్ ఆఫ్ ద డే : ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఎ క్రోకొడైల్ ఫెస్టివ‌ల్..పీఆర్సీ

-

నిన్న‌టి వేళ యువ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని క‌లిసి ఉద్యోగ సంఘ నాయ‌కులు థాంక్స్ చెప్పారు.ఓ విధంగా థాంక్స్ మీట్ ను కండ‌క్ట్ చేశార‌నే చెప్పాలి.పైకి పేరు అదే కాక‌పోయినా కూడా ఉద్యోగ సంఘాల నాయ‌కులు త‌మ కృత‌జ్ఞ‌త‌ను అయితే చాటుకున్నారు.అంతేకాదు జ‌గ‌న్ ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు అంతా మేలే చేస్తుంద‌న్న భావ‌న ఒక‌టి అంతా వినిపించారు.తాము అనుకున్న విధంగా ఆర్థిక ప‌రిస్థితి బాలేక పోయినా కూడా సీఎం మాత్రం వీలున్నంత మేర సాయం చేశార‌ని సంబ‌ర‌ప‌డిపోతున్నారు.ఇవ‌న్నీ బాగానే ఉన్నా జ‌గ‌న్ ద‌గ్గ‌ర చెప్పిన మాట‌లు అన్నీ రాజ‌కీయంగా బాగున్నాయి కానీ ఆచ‌ర‌ణ మాత్రం విభిన్నంగా ఉండ‌బోతుందా అన్న అనుమానాలూ వ్య‌క్తం అవుతున్నాయి.జ‌గ‌న్ ఇచ్చిన మాట నిల‌బెట్టుకుంటార‌న్న న‌మ్మ‌కం అంద‌రిలోనూ లేదు.ఎందుకంటే అందుకు త‌గ్గ ఆర్థిక ప‌రిస్థితులు ఏవీ అనుకూలంగా లేవు. క‌నుక ఇప్పుడు కాంట్రాక్టు లెక్చ‌రర్లు కూడా రోడ్డెక్క నున్నారు అని తేలిపోయింది.పాపం వాళ్లు త‌మ స‌మ‌స్య‌లు పరిష్క‌రించ‌మ‌ని కోరుతూ మీడియా ముఖంగా క‌న్నీటి ప‌ర్యంతం అయ్యారు.

నిన్న‌టి వేళ సీఎంకు త‌మ డిమాండ్ల‌ను అంగీక‌రించినందుకు ఒక మొక్క ఇచ్చి ధ‌న్య‌వాదాలు చెప్పివ‌చ్చారు ఉద్యోగ సంఘ నాయ‌కులు.ఇదంతా బాగానే ఉన్నా కీల‌క డిమాండ్లను ఏవీ ప‌రిష్క‌రించ‌లేని స్థితిలో రాష్ట్ర ప్ర‌భుత్వం ఉంద‌న్న విమ‌ర్శ ఒక‌టి టీచ‌ర్ల నుంచి వినిపిస్తోంది. ఇదే నిజం కూడా! ఎందుకంటే రెగ్యుల‌ర్ ఉద్యోగులు కాకుండా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్,గ్రామ స‌చివాల‌య, వలంటీర్లు క‌లుపుకుని మ‌రో మూడు ల‌క్ష‌ల మంది ఉద్యోగులు ఉన్నారు. వారి గురించి వీళ్లేం ప‌ట్టించుకోలేదు. క‌నుక వీళ్లంతా మ‌రో సారి ఉద్య‌మ బాట ప‌ట్టేందుకు పెన్ డౌన్, యాప్ డౌన్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. న‌ల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిర‌స‌న‌లు చేయ‌నున్నారు.క‌నుక పీఆర్సీ యుద్ధం అప్పుడే ముగిసిపోలేదు ముందుంది మొస‌ళ్ల పండుగ..ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ ఎ క్రోకొడైల్ ఫెస్టివ‌ల్ ..

Read more RELATED
Recommended to you

Latest news