సౌతాఫ్రికాతో టీమిండియా మూడో టెస్టు ఆడుతున్న విషయం తెలిసిందే. కాగ మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కొల్పోయి 101 పరుగులు చేసింది. సౌతాఫ్రికా విజయం సాధించాలంటే.. ఇంకా 111 పరుగులు చేయాలి. కాగ గురువారం రోజు జరిగిన మూడో రోజు ఆటలో డీఆర్ఎస్ నిర్ణయం పై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి, బౌలర్ అశ్విన్, వికెట్ కీపర్ కె ఎల్ రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే సౌతాఫ్రికా రెండు ఇన్నింగ్స్ ఆడుతున్న సమయంలో 21 వ ఓవర్ ను స్పిన్నర్ అశ్విన్ బౌలింగ్ చేశాడు.
అయితే అప్పుడు బ్యాటింగ్ చేస్తున్న ఎల్గర్ ప్యాడ్ కు బంతి తగలడంతో అవుట్ అని అశ్విన్, కోహ్లి, రాహుల్ అంపర్ కు అప్పిల్ చేశారు. దీంతో అంపర్ అవుట్ అని ప్రకటించాడు. అయితే అంపర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఎల్గర్ రివ్యూ కోరాడు. దీంతో బంతి వికెట్ల మీద నుంచి వెళ్లిందని డీఆర్ఎస్ లో తెలింది. డీఆర్ఎస్ నిర్ణయంపై మైదానంలో ఉన్న వారంతా అవక్కాయ్యారు. స్పిన్నర్ బౌలింగ్ లో బంతి వికెట్ పై నుంచి పోవడం ఎంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ మ్యాచ్ లో అంపర్ గా ఎరాస్మస్ కూడా ఈ నిర్ణయం పై అసంతృప్తి వ్యక్తం చేశాడు. కోహ్లి అయితే అసహనానికి గురి అయ్యాడు.
కోహ్లి స్టంప్ మైక్ వద్దకు వచ్చి “బంతికి మెరుగు పెడుతున్నప్పుడు కేవలం ప్రత్యర్థి పైనే కాదు.. మీ జట్టు పైనా కూడా దృష్టి పెట్టాలి” అని సౌతాఫ్రికా సూపర్ స్పోర్ట్స్ ను ఉద్దేశించి అన్నాడు. అలాగే వికెట్ కీపర్ కె ఎల్ రాహుల్.. “పదకొండు మందికి వ్యతిరేకంగా దేశం మొత్తం ఉంది” అని వ్యాఖ్యానించాడు. అలాగే బౌలర్ అశ్విన్.. “సూపర్ స్పోర్ట్స్ .. మీరు గెలవాలంటే మంచి మార్గాన్ని ఎంచుకోండి” అని అన్నాడు. కాగ ప్రస్తుతం డీఆర్ఎస్ నిర్ణయం తో పాటు కోహ్లి, అశ్విన్, రాహుల్ చేసిన వ్యాఖ్యలు కూడా వైరల్ అవుతున్నాయి.
— Addicric (@addicric) January 13, 2022
— Bleh (@rishabh2209420) January 13, 2022
— Bleh (@rishabh2209420) January 13, 2022