సంక్రాంతి స్పెషల్.. “ఆర్ఆర్ఆర్” నుంచి ఊర మాస్ పోస్టర్

ఆర్ ఆర్ ఆర్ నుంచి సంక్రాంతి కానుకగా లో అదిరిపోయే అప్డేట్ వదిలింది చిత్ర బృందం. ఈ సినిమా నుంచి.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఉన్నటువంటి ఓ మాస్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇక ఇందులో ఓ ముస్లిం వ్యక్తిలా.. కర్ర పట్టుకొని ఎన్టీఆర్ సందడి చేయగా… ఓయ్ ఇంగ్లీష్ మ్యాన్ లా డ్రెస్ వేసుకుని రామ్ చరణ్… కనువిందు చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాగా ఆర్.ఆర్ ఆర్ చిత్ర బృందం ఇటీవలే సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి 7వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది చిత్ర బృందం. కరోనా కారణంగా  థియేటర్లు మూతపడుతున్న నేపథ్యంలోనే తమ మూవీ విడుదల తేదీని మార్చుకుంటున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం.  ఈ మేరకు ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ ఈ ప్రకటన చేయడంతో ఫాన్స్ అందరూ నిరాశ చెందారు.