క్రికెట్: పాకిస్తాన్ దెబ్బ మీద దెబ్బ.. ఇంగ్లండ్ కూడా ఆడనంటుంది..

పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు దెబ్బ మీద దెబ్బ పడింది. పాకిస్తాన్ లో ఆడలేమంటూ తట్టా బుట్టా సర్దుకుపోయిన న్యూజిలాండ్ తర్వాత మరో దేశం గట్టి షాక్ ఇచ్చింది. పాకిస్తాన్ లో క్రికెట్ సిరీస్ ఆడడానికి రావాల్సిన ఉన్న ఇంగ్లమ్డ్ జట్టు, భద్రతా కారణాల వల్ల పాకిస్తాన్ కి రావట్లేదని, ఆటగాళ్ళ భద్రత అన్నింటికంటే ముఖ్యమని తేల్చిపారేసింది. ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుండి ప్రపంచమంతా పాకిస్తాన్ ను గమనిస్తూనే ఉంది. ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ పెంచి పోషిస్తుందన్న వాదనలు వెలువడుతూనే ఉన్నాయి.

ఈ తరుణంలో పాకిస్తాన్ కు రావడం, మ్యాచులు ఆడడం సరైనది కాదని ఇంగ్లండ్ వెనక్కి తగ్గింది. ఈ దెబ్బతో పాకిస్తాన్ పరువు పోయింది. ఒకటి కాదు రెండు దేశాలు కూడా పాకిస్తాన్ కు రాలేమని చెప్పడంతో ప్రపంచ దేశాల నడుమ పాకిస్తాన్ పరువు గంగలో కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ కొంత సీరియస్ అయ్యారు. పాకిస్తాన్ కు రాలేమన్న దేశాలపై వరల్డ్ కప్ మ్యాచుల్లో తమ సత్తా చూపించాలని, ఇలా పర్యటనకు రాకపోవడం సబబు కాదని వ్యాఖ్యానించారు.