అనుష్కతో కోహ్లీ వీడియో కాల్‌.. మధ్యలో ఫ్యాన్స్‌

విరుష్క.. అదేనండీ మన విరాట్ కోహ్లీ-అనుష్క జోడీ అంటే చాలా మందికి ఇష్టం. వారిద్దరు కలిసి కనిపిస్తే ఇక ఫ్యాన్స్ కి పండగే. విరాట్ కెరీర్ అనుష్క వల్లే నెమ్మదించిందని కొందరు అర్థం లేని రాద్ధాంతం చేస్తున్న.. నిజమైన ఫ్యాన్స్ మాత్రం అనుష్కతోనే విరాట్ లైఫ్ కంప్లీట్ అవుతుందని.. ఆమె అతడి వెన్నంటే ఉండి ప్రోత్సహిస్తుందని బలంగా నమ్ముతుంటారు. అయితే తాజాగా విరాట్ తన భార్య అనుష్కతో వీడియో కాల్ మాట్లాడుతుంటే మధ్యలో ఫ్యాన్స్ సందడి చేశారు. అదేంటీ అనుకుంటున్నారా.. అయితే ఈ స్టోరీ చదివేయండి.

దక్షిణాఫ్రికాతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టీ20లో అదరగొట్టిన విషయం  తెలిసిందే. తిరువనంతపురంలో గ్రీన్‌ఫీల్డ్‌ ఇంటర్నేషన్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ అనంతరం జట్టు సభ్యులంతా బస్సులో తిరుగుపయనవుతుండగా చుట్టూ అభిమానులు గుమి గూడారు. కేరింతలతో వారిని హుషారెత్తించారు. కోహ్లీని చూసి బిగ్గరగా నినాదాలు చేశారు.

ఆ టైంలో కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో వీడియో కాల్‌ మాట్లాడుతున్నాడు. సరదాగా.. చేతిలో ఉన్న ఫోన్‌ను అభిమానులవైపు తిప్పి అనుష్కను చూపించాడు. దీంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.