యూఏఈ వేదిక గా జరుగుతున్న టీ 20 ప్రపంచ కప్ లో టీమిండియా ఎట్టకేలకు విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ మొదలు పెట్టిన భారత్ 210\2 భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ లు రోహిత్ 74(47) కెఎల్ రాహుల్ 69(47) రాణించారు. అలాగే రిషబ్ పంత్ 27(13) రాణించాడు. చివర్లో హార్ధిక్ పాండ్య 35(13) మెరుపు ఇన్నింగ్స్ ఆడటం తో 200 మార్క్ స్కోర్ ను టీమిండియా దాటింది.
211 పరుగుల టార్గెట్ తో బరి లోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ అది లోనే చుక్క ఎదురు అయింది. ఆఫ్ఘాన్ ఓపెనర్ మహ్మద్ సహజద్ రెండో ఓవర్ లో మహ్మద్ షమీ బౌలింగ్ లో పరుగులు ఏమీ చేయకుండానే వెనుదిరిగాడు. మళ్లి వెంటనే 3.1 ఓవర్లో బుమ్రా బౌలింగ్ లో మరో ఓపెనర్ 13 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. అప్పుడే ఆఫ్ఘాన్ ఓటమి ఖరారు అయింది. చివరి వరకు ఆఫ్ఘాన్ 144 \7 పరుగులు మాత్రమే చేసింది. ఇండియా నుంచి మహ్మద్ షమ్మీ మూడు వికెట్లు తీశాడు. అశ్విన్ 2, బుమ్రా, జడేజా తలో ఒక వికెట్ తీశారు.
ఈ ప్రపంచ కప్ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు పాకిస్థాన్ తో న్యూజిలాండ్ తో ఆడిన టీమిండియా.. రెండిటీ లో నూ ఘోర పరాజయాన్ని ముటకట్టుకుంది. దీంతో సమీ ఫైనల్స్ ఆశలు ఆవిరి అయిపోయాయి. కొన్ని అద్భుతాలు జరుగుతె తప్ప భారత్ సెమీస్ లో అడుగు పెట్టదు. అయితే ఇప్పుడు ఉన్న సందర్భంలో అది సాధ్యం కాదు అని చెప్పాలి.