పెట్రోల్ రేట్లను మరింత తగ్గించిన 9 రాష్ట్రాలు..

-

దీపావళి వేళ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పెట్రోల్, డిజిల్ రేట్లు తగ్గించింది. కేంద్ర ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం ద్వారా పెట్రోల్, డిజిల్ రేట్లను తగ్గించింది. దేశవ్యాప్తంగా పెట్రోల్పై రూ. 5, డిజిల్ పై రూ. 10 తగ్గించిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా పెరుగుతన్న ఇంధన ధరలకు ఈ చర్యతో కళ్లెం పడింది. తాజాగా మరికొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు తమ పన్నులు తగ్గించుకోవడంతో మరింతగా పెట్రోల్ ధరలు దిగి రానున్నాయి. 9 బీజేపీ పాలిత రాష్ట్రాలు పెట్రోల్ పై పన్నులను తగ్గించాయి. దీంతో ప్రజలపై పెట్రోల్ భారం తగ్గనుంది. అస్సాం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక, గోవా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్ – పెట్రోల్ మరియు డీజిల్ ధరలలో అదనపు తగ్గింపులను ప్రకటించాయి. ఈ రాష్ట్రాల్లో అస్సాం, త్రిపుర, మణిపూర్, కర్ణాటక మరియు గోవా రాష్ట్రాలు లీటర్ పెట్రోల్పై రూ. 7 తగ్గించాయి. మరో వైపు యూపీ ఏకంగా రూ. 12 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. హిమాచల్ ప్రదేశ్ రూ. 2 తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజలకు పెట్రోల్ మరింత అందుబాటులోకి రానుంది. కాగా ప్రస్తుతం ధరలను బీజేపీ రాష్ట్రాలు మాత్రమే తగ్గించాయి. మిగతా రాష్ట్రాల్లో తగ్గించాలని డిమాండ్లు వస్తున్నాయి. తెలంగాణ లోకూడా రేట్లు తగ్గించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. 

Read more RELATED
Recommended to you

Latest news