క్రికెట్: హార్ధిక్ పాండ్యా ఆబ్సెంట్.. హర్భజన్ కీలక వ్యాఖ్యలు..

ఇంగ్లండ్ తో టెస్టు సిరీస్ కి సిద్ధం అవుతున్న ఇండియా ఈరోజు తొలి ఆట మొదలు పెట్టనుంది. ఇంగ్లండులోని నాటింగ్ హామ్ వేదికగా మొదటి టెస్టు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. గతంలో జరిగిన టెస్టు సిరీస్ ని దృష్టిలో పెట్టి చూసుకుమ్టే నాటింగ్ హామ్ లో జరిగిన రెండు టెస్టుల్లో ఒక మ్యాచు ఇంగ్లండ్ గెలవగా మరో మ్యాచ్ ఇండియా గెలిచింది. ఆ సిరీస్ లోని ఒక మ్యాచులో పాండ్యా చెలరేగిపోయాడు. అటు బౌలింగ్ తో 5వికెట్లు తీసి, ఇటు బ్యాటింగ్ లో 168పరుగులు చేసాడు.

ఐతే ప్రస్తుతం హార్ధిక్ పాండ్యా ఆటలో లేడు. పాండ్యా గైర్హాజరు మ్యాచుపై ప్రభావం పడుతుందని, అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు. జట్టులో ఆల్ రౌండర్లు కీలకం అని, కఠిన పరిస్థితుల్లో అటు బౌలింగ్ తో, ఇటు బ్యాటింగ్ తో జట్టుని విజయ తీరాలకు చేర్చడానికి వారి సహకారం ఉంటే బాగుంటుందని, ప్రస్తుతం ఆ లోటు కనిపించేలా ఉందని యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.