ఈ యాప్స్ వల్లే మీ ఫోన్‌ బ్యాట‌రీ త్వ‌ర‌గా అయిపోతుంది

-

కరోనా నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం మరింత పెరిగింది. ఒకవైపు ఆన్‌లైన్‌ క్లాసులు.. మరోవైపు వర్క్‌ ఫ్రం హోం. స్మార్ట్‌ ఫోన్‌ వినియోగం పెరిగినప్పటి నుంచి ఇంటికి కావాల్సిన నిత్యావసరాలను సైతం ఫోన్‌ ద్వారానే కొంటున్నాం. వివిధ యాప్‌లను కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పీ క్లౌడ్‌ స్టోరేజీ కంపెనీ కొన్ని యాప్స్‌ను మన ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకోవడం వల్ల ఫోన్‌ బ్యాటరీ డౌన్‌ అవుతుందని వెల్లడించింది ఆ వివరాలు తెలుసుకుందాం.

వాట్సాప్‌ | Whatsapp
వాట్సాప్‌ | Whatsapp

వాట్సాప్‌ ఈరోజుల్లో వాట్సాప్‌ లేని వారుండరు. కానీ, ఈ యాప్‌ను మన ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవడం వల్ల ఫోన్‌ బ్యాటరీ హరిస్తుంది. ఎక్కువ శాతం వాట్సాప్‌ ద్వారానే ఫోన్‌ బ్యాటరీ డౌన్‌ అవుతుంది.

ఇంకా, ఆ తర్వాతి స్థానంలో ఇన్‌స్టాగ్రాం ఉండగా, జూమ్‌ యాప్‌, ఉబర్‌ యాప్, యూట్యూబ్, అమెజాన్‌ ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి.

టిండర్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడం వల్ల మన ఫోన్‌ బ్యాటరీ డౌన్‌ అవుతుంది. ఫేస్‌బుక్, లింక్డిన్, టెలిగ్రాం యాప్‌ల ద్వారా కూడా స్నాప్‌ చాట్, స్కైప్, ఫిట్‌ బిట్, మై వెరిజన్, ఏయిర్‌ బీఎన్‌బీ, బీగో లైవ్, బుకింగ్‌.కమ్, బంబుల్, గ్రైండర్, లైకీ యాప్‌లు కూడా స్మార్ట్‌ ఫోన్‌ల బ్యాటరీ డౌన్‌ అయ్యేందుకు ప్రధానం కారణమని పీ క్లౌడ్‌ యాప్‌ తెలిపింది.

వర్క్‌ ఫ్రం హోం ఎక్కువైన నేపథ్యంలో అనవసర యాప్‌లను ఫోన్‌ నుంచి తొలగించడమే మేలు. దీనివల్ల మీ ఫోన్‌ బ్యాటరీ కూడా ఆదా అవుతుంది. స్టోరేజీ కూడా క్లీన్‌ అవుతుంది. ఎప్పటికప్పుడు ఫోన్‌ క్లీయర్‌ చేయడం వల్ల కూడా ఫోన్‌ వేడి తగ్గుతుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news