ఈ ఐపీఎల్ కి నా హీరో అతనే.. కపిల్ దేవ్

క్రికెట్లో భారతదేశానికి మొదటి ప్రపంచ కప్ అందించిన ఆటగాడు కపిల్ దేవ్, ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఐపీఎల్ లో ఆకట్టుకున్న ఆటగాళ్లందరిలో నాకు బాగా నచ్చిన ఆటగాడు.. టి నటరాజన్. యార్కర్లతో చెలరేగిపోయే నటరాజన్, ఎక్కడా తడబడ్డట్టు కనిపించలేదు. యార్కర్లు వేయడంలో అతన్ని మించిన వారు లేరు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ కి నా హీరో నటరాజనే అని చెప్పుకొచ్చాడు.

సన్ రైజర్స్ కి చెందిన నటరాజన్, టోర్నమెంట్ మొత్తంలో 16వికెట్లు తీసుకున్నాడు. అది కూడా అత్యంత కీలక ఆటగాళ్ళ వికెట్లు పడగొట్టడంతో అందరి దృష్టిలో పడ్డాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచులో విరాట్ కోహ్లీ, డివిలియర్స్ వికెట్లు పడగొట్టి బౌలింగ్ లో తన ప్రతిభ కనబర్చాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరగనున్న ట్వంటీ ట్వంటీ మ్యాచులకి సెలెక్ట్ అయ్యాడు. మరి కపిల్ దేవ్ ని మెప్పించిన ఆటగాడు ఆస్ట్రేలియాలో ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి.