ఇండియాలో మళ్ళీ పెరుగుతున్న కరోనా.. ఒక్కరోజే 46,232 కేసులు !

-

భారత్ లో కరోనా విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. ఒక రోజు కేసులు, మరణాలు బాగా తగ్గుతోంటే మళ్ళీ వెంటనే పెరుగుతున్నాయి. అయితే నిన్నటి కంటే ఈ రోజు మళ్ళీ కేసులు పెరిగాయి. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం గడిచిన 24 గంటలలో 46,232 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అలాగే గడచిన 24 గంటల్లో దేశంలో కరోనా వల్ల మొత్తం 564 మంది మృతి చెందారు.

అలాగే గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 49,715గా ఉంది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 90,50,598 కాగా అందులో ఇప్పుడు దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 4,39,747గా ఉన్నాయి. ఇప్పటి దాకా కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 84,78,124కి చేరింది. అలాగే కరోనా వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 1,32,726కి చేరింది. నిన్న ఒక్కరోజే 10,66,022 కరోనా పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 13,06,57,808 పరీక్షలు చేసినట్లు అయింది. అయితే రికవరీ రేటుతో పాటు దేశంలో నమోదవుతున్న కేసుల కంటే రికవరీ కేసులు ఎక్కువ కావడం ఊరటనిచ్చే అంశం అని చెప్పక తప్పదు.

 

 

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news