కోహ్లీ యాటిట్యూడ్ ఇష్టం కానీ… : బీసీసీఐ చీఫ్ గంగూలీ

బీసీసీఐలో గంగూలీకి విరాట్ కోహ్లి మ‌ధ్య కోల్డ్ వార్ న‌డుస్తుంద‌ని చాలా రోజుల నుంచి వినిపిస్తుంది. ఈ కోల్డ్ వార్ వ‌న్డే జ‌ట్టు నుంచి విరాట్ కోహ్లిని తొల‌గించిన నాటి నుంచి ఇంకా పెరిగింద‌ని స‌మాచారం. అయితే తాజా గా నిన్న సాయంత్రం విరాట్ కోహ్లి పై బీసీసీఐ చీఫ్ గంగూలీ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి. గురుగ్రామ్ లో శ‌నివారం బీసీసీఐ చీఫ్ గంగూలీ ఒక కార్యక్ర‌మంలో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మం లో విరాట్ కోహ్లి లో న‌చ్చిన విష‌యం ఎంటి అని ఒక‌రు ప్ర‌శ్నించిగా.. ”బీసీసీఐ చీఫ్ గంగూలీ ఇలా స‌మాధానం ఇచ్చాడు.

విరాట్ కోహ్లి యాటిట్యూడ్ అంటే ఇష్టం. కానీ.. ఈ మ‌ధ్య త‌ను చిక్కుల్లో ప‌డుతున్నాడు” అని వ్యాఖ్యానించాడు. అయితే కోహ్లి పై పాజిటివ్ వ్యాఖ్య‌లు చేశాడ‌ని ప‌లువురు అన్నారు. అయితే మ‌రి కొంద‌రు మాత్రం కోహ్లి చిక్కుల్లో ప‌డుతున్నాడ‌ని వారి మ‌ధ్య ఉన్న వివాదాన్ని ప్ర‌స్తావించాడ‌ని అంటున్నారు. కాగ వీరి మ‌ధ్య నెల‌కొన్న వివాదం రోజుకు ఒక మ‌లుపు తిరుగుతుంది. త‌న‌ను సంప్రదించకుండానే కెప్టెన్సీ నుంచి తొల‌గించార‌ని చెప్ప‌డం తో వివాదం కాస్త ముదిరింది.