శ్రీవారి భక్తులకు బిగ్ షాక్.. ఉదయాస్తమాన సేవ టికెట్ ధర రూ. 1.5 కోట్లు

తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ పాలకమండలి ఊహించని షాక్ ఇచ్చింది. తిరుమల దేవస్థాన ఉదయాస్తమాన సేవ టికెట్ల ధరలను నిన్న టిటిడి పాలక మండలి నిర్ణయించింది. సాధారణ రోజుల్లో ఉదయాస్తమాన సేవ టికెట్ ధరను కోటి రూపాయలుగా నిర్ణయించింది టీటీడీ. అదే శుక్రవారం రోజున ఈ టికెట్ ధర రూ.1.5 కోట్లు గా ఉంటుంది.

ttd

టీటీడీ వద్ద 531 ఉదయాస్తమాన టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ టికెట్ తో 25 సంవత్సరాల పాటు శ్రీవారి ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశం భక్తులకు లభిస్తుంది. దేవస్థానం సేవా టికెట్ తీసుకున్న వారికి ఏడాదికి ఒక రోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఆరుగురు భక్తులు పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ టికెట్ల వల్ల టిడిపికి దాదాపు 600 కోట్ల రూపాయల ఆదాయం రానుంది. ఈ సేవా టిక్కెట్ల వల్ల వచ్చే ఆదాయాన్ని చిన్న పిల్లల ఆసుపత్రి అభివృద్ధికి కేటాయించాలని నిర్ణయం తీసుకుంది టీటీడీ పాలక మండలి.