ఇండియా- పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ పై షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు

ఈ ఏడాది మరో సారి దాయాదులు ఇండియా-పాక్ తలబడనున్నాయి. ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2022 షెడ్యూల్ శుక్రవారం (జనవరి 21) నాడు విడుదలైంది. మెల్‌బోర్న్ లో ప్రారంభ మ్యాచ్‌లోనే టీమిండియా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్ పై ఇప్పటి నుంచే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తాజాగా పాక్ మాజీ క్రికెటర్ స్పీడ్ స్టార్ షోయబ్ అక్తర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి పాకిస్తాన్ చేతిలో భారత్ ఓడిపోతుందని జోస్యం చెప్పాడు.

పాకిస్తాన్, భారత్ కన్నా మెరుగైన స్థితి ఉందని.. 2021 దుబాయ్ లో జరిగినట్టే పాక్, ఇండియాను ఓడిస్తుందన్నారు. గతేడాది దుబాయ్ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా నాకౌట్ కూడా దాటలేకపోయింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ చేతిలో 10 వికేట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.

టీ20 ప్రపంచ కప్ 2022 ఆస్ట్రేలియాలో అక్టోబర్ 16 నుండి నవంబర్ 13 మధ్య జరగనుంది . మెల్‌బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్, అడిలైడ్, గీలాంగ్, హోబర్ట్ మరియు పెర్త్ వేదికల్లో మొత్తం 45 మ్యాచులు జరుగనున్నాయి.