కరోనాతో 150 మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు మృతి

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు అతలాకుతలం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ కరోనా కారణంగా పేద, ధనిక అనే తేడా లేకుండా చాలా మంది మరణించారు. అయితే.. ఈ వైరస్‌ ప్రభావం విశాఖ స్టీల్‌ ప్లాంటు పై కూడా పడింది. 150 మంది స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కరోనా మహమ్మారి వల్ల మృతి చెందారు. ఈ విషయాన్ని స్వయంగా… విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఛైర్మన్ సి హెచ్ నరసింగరావు తెలిపారు.

visakha steel plant issue

విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటి కీలక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఒక్క రోజు కూడా విరామం ఇవ్వకుండా నిరసన దీక్షలు చేసామని.. ఈ పరిస్థితి లో కూడా 700 కోట్లు లాభాలు వచ్చాయని వెల్లడించారు. వచ్చే నెల 12 తో ఏడాది అవుతుందని.. 365 జెండాలను పట్టుకుని నిరసన ప్రదర్శన చేపడతామన్నారు. వచ్చే నెల 13న ఉద్యమం ఏడాది పూర్తియిన సందర్భంగా బీజేపీ కార్యాలయం ముట్టడి ఉంటుందని ప్రకటన చేశారు. ఫిబ్రవరి 23 న విశాఖ నగరం తో పాటు..రాష్ట్ర బంద్, ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు కోటి సంతకాల సేకరణ ఉంటుందని చెప్పారు.