ఇండియా తరపున క్రికెట్ ఆడి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించిన ఎందరో గొప్ప గొప్ప ఆటగాళ్లను అభిమానులు ఇప్పటికే మరిచిపోరు. అలాంటి గొప్ప క్రికెటర్ లలో ఒకరే కాబూల్ కు చెందిన సలీం దురానీ. సలీం జట్టులో లెఫ్ట్ ఆర్మ్ బ్యాటింగ్ మరియు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలింగ్ చేసేవాడు. దానితో ఆల్ రౌండర్ గా ఉంటూ జట్టుకు విశేషమైన సేవలను అందించాడు. ఈయన ఇండియా తరపున మొత్తం 29 టెస్ట్ లలో ప్రాతినిధ్యం వహించాడు.
సలీం కేవలం 1960 నుండి 1973 వరకు మాత్రమే జట్టులో ఉన్నాడు. ముఖ్యంగా 1961-62 సంవత్సరంలో ఇంగ్లాండ్ తో టెస్ట్ సీరీస్ లో తన ఆల్ రౌండ్ ప్రతిభతో జట్టుకు 2-0 తో సీరీస్ ను అందించాడు. సలీం ఎంతో సులభంగా బంతిని సిక్సు గా మలిచేవాడు. కాగా మూడు నెలల క్రితం ఇతనికి తొడ ఎముక విరగడంతో సర్జరీ చేయించుకుని విశ్రాంతిలో ఉన్నాడు. కానీ తాజాగా ఈ రోజు ఉదయం చికిత్స తీసుకుంటూనే మరణించారు. దీనితో కీడాలోకం శోక సంద్రంలో మునిగి పోయింది.