ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్లు ఇతర దేశాలకు చెందిన ప్లేయర్లను దూషించడంలోనే కాదు, మ్యాచ్‌లో చీటింగ్ చేయడంలోనూ ముందే ఉంటారు. గతంలో వార్నర్, స్మిత్‌లు ఇద్దరూ బాల్ టాంపరింగ్ చేసి దొరికిపోయారు. దీంతో ఐసీసీ వారిపై ఏడాది పాటు నిషేధం విధించింది. అయినా స్మిత్‌కు మాత్రం ఇంకా బుద్ది రాలేదు. మ్యాచ్‌లో మళ్లీ చీటింగ్ చేస్తూ దొరికిపోయాడు.
తాజాగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య సిడ్నీలో జరిగిన టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం విదితమే. కాగా భారత్ రెండో ఇన్నింగ్స్ సమయంలో రిషబ్ పంత్ క్రీజులో ఉన్నప్పుడు అతను క్రీజులోకి వచ్చేందుకు ముందు స్మిత్ పంత్‌కు చెందిన బ్యాటింగ్ గార్డును చెరిపివేశాడు. బ్యాట్స్‌మెన్ సాధారణంగా బ్యాటింగ్ చేసేటప్పుడు వికెట్లకు గార్డ్ తీసుకుంటారు. అంటే.. ఏ వికెట్ లైన్‌ను ఆధారంగా చేసుకుని ఆడాడో క్రీజులో కాళ్లతో గీతలు పెట్టుకుంటారన్నమాట. అయితే ఆ గీతను స్మిత్ చెరిపివేశాడు. ఆ దృశ్యాలు అక్కడే ఉన్న వికెట్ల కెమెరాల్లో రికార్డయ్యాయి.
Dirty tactics bu Aussies. After the lunch, Aussies scuff out the batsmen's guard marks😐
Rishabh Pant had to take guard again😞#INDvAUS pic.twitter.com/8ILEY1RfLP">
— The Sports God (@TheSportsGod_) January 11, 2021
ఇక రిషబ్ బంత్‌కు చెందిన బ్యాటింగ్ గార్డ్ గీతను స్మిత్ చెరిపివేయగానే క్రీజులోకి వచ్చిన పంత్ అంపైర్ సహాయంతో మళ్లీ గార్డ్ లైన్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ దృశ్యాలను కూడా వీడియోలో చూడవచ్చు. అయితే స్టీవ్ స్మిత్ ఇలా చేయడంపై ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. స్మిత్ చీటింగ్ చేశాడంటూ అతన్ని తీవ్రంగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. ఆ ట్రోల్స్ తోపాటు స్మిత్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.