సొంత మైదానంలో సీఎస్కే హ్యాట్రిక్.. ధోని ఫుల్ ఖుష్.. వీడియో వైరల్

-

రెండు వరుస ఓటముల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సూపర్గా ఆడింది. బలంగా పుంజుకున్న జట్టు హ్యాట్రిక్‌ విజయాలతో జోరుమీదున్న కోల్‌కతాకు చెక్‌ పెట్టింది. సోమవారం రోజున హోమ్ గ్రౌండ్లో జరిగిన మ్యాచ్లో మొదటి నుంచి కోల్కతా బ్యాటర్లను కట్టుదిట్టం చేసింది. జడేజా, ఇతర బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో నైట్‌రైడర్స్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేసిన సూపర్‌కింగ్స్‌.. కెప్టెన్‌ రుతురాజ్‌ సూపర్‌ బ్యాటింగ్‌తో లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది.

సొంత మైదానంలో చెన్నై మరోసారి అదిరిపోయే ప్రదర్శన చేసి హ్యాట్రిక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. తొలుత 137 పరుగులకే ఆ జట్టును కట్టడి చేసిన చెన్నై.. అనంతరం  17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫామ్‌లోకి వచ్చిన కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (67*)తో తన జట్టును గెలిపించాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. మూడింట్లో విజయం సాధించింది. అవన్నీ సొంతమైదానంలోనే కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్ తర్వాత ధోనీ ముఖంలో చిరునవ్వు చూడాలి. ఎంతో సంబురంగా తోటి క్రీడాకారులతో కరచాలనం చేస్తున్న ధోనీ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news