ఈ ఏడాదితో పాటు రానున్న రెండేళ్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్ కి ధోనీ కెప్టెన్గా ఉంటాడని సీఎస్క్కే సీఈఓ కాశీ విశ్వనాథన్ చెప్పారు. వచ్చే నెల 19 నుంచి యూఏఈ వేదికగా ఐపీఎల్ 13వ సీజన్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ.. గతవారం స్వస్థలం రాంచీలోని ఇండోర్ అకాడమీ ప్రాక్టీసు చేశాడు. ఆగస్టు 16-20 మధ్య జరగబోయే శిక్షణా శిబిరంలో పాల్గొనున్నాడని సమాచారం.
గతేడాది ప్రపంచకప్లో చివరగా కనిపించిన ధోనీ.. ఆ తర్వాత ఐపీఎల్లో ఆడి జాతీయ జట్టులో చోటు దక్కించుకోవాలని భావించాడు. మార్చిలో కరోనా రావడం, లీగ్ నిరవధిక పడటం, టీ20 ప్రపంచకప్ వాయిదా.. ఇలా చాలానే అనుకోని సంఘటనలు జరిగాయి. దీంతో మహీ కెరీర్ సందిగ్ధంలో పడింది.ఐపీఎల్ 2020, 2021లో ధోనీ ఆడతాడు. 2022లోనూ జట్టులోనే ఉంటాడు. ధోనీ ప్రాక్టీసు చేస్తున్నాడని నాకు మీడియా ద్వారానే తెలిసింది. కెప్టెన్ ఫామ్ గురించి మాకు కంగారేమి లేదు. తన బాధ్యతలేంటో మహీకి తెలుసు అని చెన్నై జట్టు సీఈఓ కాశీ విశ్వనాథన్ అన్నారు.