తూర్పుగోదావరి లోని సీతానగరంలో శిరోముండనం కేసు రెండు తెలుగు రాష్ట్రాలు దాటి ఢిల్లీకి చేరుకుంది. ఈ విషయం గురించి అందరికీ తెలిసిందే.. తాను నక్సలైట్ లో చేరి తనకు జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటా అని [tps_header][/tps_header]బాధితుడు రాష్ట్రపతికి లేఖ రాశాడు.బాధితుడు ప్రసాద్ రాసిన లేఖపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. కేవలం 24 గంటలు వ్యవధిలోనే ఏపి జీఏడీ అసిస్టెంట్ సెక్రటరీ జనార్దన్ బాబుకి కి ఫైల్ ట్రాన్స్ఫర్ చేసింది రాష్ట్రపతి కార్యాలయం. శిరోముండనం కేసు గురించి నేరుగా జనార్దన్ బాబుని కలవాలని బాధితుడు ప్రసాద్ కు రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది.
ప్రసాద్ కి పూర్తి స్థాయి లో సహకారం అందించాలని జనార్ధన్ బాబుకు రాష్ట్రపతి కార్యాలయం సూచించింది.త్వరలోనే శిరోముండనం ఘటనపై పూర్తి స్థాయి కాల్ రికార్డ్స్, వీడియో క్లిప్స్, కాల్ రికార్డింగ్స్ తో జనార్దన్ బాబుని బాధితుడు ప్రసాద్ కలుస్తాడు.ఇండుగుమిల్లి ప్రసాద్ కు ప్రాధమికంగా 50 వేల రూపాయల పరిహారం మంజూరు చేసిన జిల్లా కలెక్టరు మురళీధర్ రెడ్డి.మునికూడలిలో ప్రసాద్ కు చెక్ ను అధికారులు అందజేశారు.