ఆ సెంటిమెంట్ ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ విజేత…

-

ఈ రోజు ఐపీఎల్ సీజన్ 16 లో ఫైనల్ మ్యాచ్ అహమ్మదాబాద్ వేదికగా జరగనుంది. ఇందులో చెన్నై మరియు గుజరాత్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో రెండు జట్లు ఫేవరేట్ లు అని చెప్పాలి, కానీ సొంత స్టేడియం లో మ్యాచ్ ఆడనున్న గుజరాత్ కు కొంచెం ప్లస్ అయ్యే అవకాశం ఉంది. కాగా గత సీజన్ ల ప్రకారం ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఉన్న రికార్డు ప్రకారం ప్లే ఆఫ్ కు చేరుకొని క్వాలిఫైయర్ 1 లో విజయం సాధించిన జట్టు 2011 నుండి 12 సీజన్ లలో సార్లు టైటిల్ ను గెలుచుకున్నాయి. ఆ ప్రకారం చూసుకుంటే చెన్నై లో జరిగిన మొదటి క్వాలిఫైయర్ లో గుజరాత్ ను ఓడించిన చెన్నై గెలవడానికి ఛాన్స్ ఉంది. కానీ అన్ని సార్లు రికార్డులు ప్రకారం ఫలితాలు వస్తాయని చెప్పలేము.

మ్యాచ్ కు వర్షం అడ్డంకి లేకుండా ఉంటే మాత్రం హోరాహోరీ తప్పదని చెప్పగలం. మరి ధోని ఈ సెంటిమెంట్ ప్రకారం టైటిల్ ను అందుకుంటాడా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news